Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని ఉరితీయండి లేదా మమ్మలను కాల్చి చంపండి : రేప్ బాలిక తల్లి

తన 8 యేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేసిన నిందితులను ఉరితీస్తారా లేదా మమ్మలను కాల్చి చంపండంటూ ఆ బాలిక తల్లి ప్రాధేయపడుతోంది.

Webdunia
ఆదివారం, 6 మే 2018 (15:11 IST)
తన 8 యేళ్ల బాలికను నిర్బంధించి అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా చంపేసిన నిందితులను ఉరితీస్తారా లేదా మమ్మలను కాల్చి చంపండంటూ ఆ బాలిక తల్లి ప్రాధేయపడుతోంది. ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా గ్రామంలో కొందరు కామాంధులు 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఎంత సంచలనం రేపిందో తెలిసిందే.
 
ఈ ఘటనపై ఆ బాలిక తల్లి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, నిందితులనైనా ఉరి తీయండి.. లేదంటే మమ్మల్ని కాల్చి చంపండి అని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వాళ్లను వదిలేస్తే మమ్మల్ని ఎలాగూ చంపుతారు. నాలుగు గ్రామాల ప్రజలు ఇప్పుడు మా వెంట పడుతున్నారు. మేం కేవలం నలుగురం ఉన్నాం. అన్నీ కోల్పోయాం. మా ఇల్లు, ఆస్తి పోయింది అని ఆమె చెప్పింది.
 
అంతేకాకుండా, సీబీఐ విచారణకు అంగీకరించాలని స్థానిక నేతలు తమపై ఒత్తిడి తెస్తునారని బాలిక తల్లి వెల్లడించింది. అయితే బాలిక కుటుంబం మాత్రం రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులే విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. నిందితులను కాపాడటం కోసమే స్థానిక నేతలు సీబీఐ విచారణ కోసం పట్టుబడుతున్నారని బాలిక తల్లి ఆరోపించింది. 
 
మేము ఫిర్యాదు ఇచ్చిన సమయంలోనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే మా బిడ్డ బతికేది. కానీ వాళ్లు ఏడు రోజుల పాటు ఏమీ చేయకుండా ఖాళీగా చేతులు ముడుచుకుని కూర్చున్నారు అని ఆమె విమర్శించింది. 
 
మరోవైపు,  ఈ కేసును కథువా నుంచి మరోచోటికి బదిలీ చేయాలంటూ బాలిక తండ్రి ఇప్పటికే  సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. మరో రెండు రోజుల్లో దీనిపై కోర్టు తీర్పు వెలువరించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments