Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్తి కోసం అమ్మ ప్రాణాలు తీసిన కసాయి కొడుకు... ఎక్కడ?

ఆస్తి కోసం అమ్మ ప్రాణాలు తీశాడో కసాయి కొడుకు. కన్నతల్లి అనే మమకారం లేకుండా వెతికి పట్టుకుని మరీ చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

ఆస్తి కోసం అమ్మ ప్రాణాలు తీసిన కసాయి కొడుకు... ఎక్కడ?
, గురువారం, 3 మే 2018 (10:46 IST)
ఆస్తి కోసం అమ్మ ప్రాణాలు తీశాడో కసాయి కొడుకు. కన్నతల్లి అనే మమకారం లేకుండా వెతికి పట్టుకుని మరీ చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అనంతపురం జిల్లా గుంతకల్‌ మండలం మద్దికేర్‌‌కు చెందిన భాగ్యమ్మ(55) అనే మహిళ భర్త రామాంజనేయులు రైల్వేలో పనిచేసి రిటైర్‌ అయ్యారు. 20 రోజుల క్రితం ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు కుమారులు. ఓ కుమార్తె ఉంది. అయితే, రామాంజనేయులు పేరుపై పలు చోట్ల ఆస్తులు ఉన్నాయి. వాటిని పంచివ్వాలని కొడుకులు సురేశ్, కిరణ్, విజయ్‌ తల్లిని వేధించసాగారు. తండ్రి చనిపోయి నెల రోజులైనా గడవకముందే ఆస్తులు పంచమని వేధించడం సరికాదని సర్దిచెపుతూ వచ్చింది.
 
అయితే తాము చెప్పినట్లు వినడం లేదని తల్లిపై ముగ్గురు కుమారులు కోపం పెంచుకున్నారు. భాగ్యమ్మ వద్ద ఉన్న బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు, పెన్షన్‌ కాగితాలను లాగేసుకున్నారు. బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకురావాలని పెద్దకొడుకు సురేశ్‌ ఇటీవల ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో డబ్బుల కోసం అవసరమైతే తనను చంపుతారని భావించిన భాగ్యమ్మ వారి నుంచి తప్పించుకుని నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బల్కంపేట దాసారం బస్తీలో ఉంటున్న సోదరి వీరమ్మ వద్దకు వచ్చి తలదాచుకుంది.
 
భాగ్యమ్మ ఎక్కడ ఉందనే విషయంపై ఆరా తీసిన చిన్నకొడుకు విజయ్‌.. చివరకు దాసారం బస్తీలోని వీరమ్మ ఇంట్లో ఉన్న విషయం తెలుసుకున్నాడు. దీంతో బుధవారం ఉదయం వీరమ్మ పనికి వెళ్లగా ఆమె కోడలు చిట్టెమ్మ బయట బట్టలు ఉతుకుతోంది. నేరుగా ఇంట్లోకి వెళ్లిన విజయ్‌ తల్లితో గొడవకు దిగాడు. తలుపులు మూసేయడంతో లోపలి నుంచి శబ్దాలు రావడాన్ని గమనించిన చిట్టెమ్మ తలుపులు తెరవాలని అరుస్తున్నా వినిపించుకోలేదు. చుట్టుపక్కల వారు ఇనుప కడ్డీలతో డోర్‌ తెరిచేందుకు ప్రయత్నించారు.
 
ఈ సమయంలో విజయ్‌ రోకలి బండతో భాగ్యమ్మ తలపై బలంగా బాదడంతో కుప్పకూలిపోయింది. అనంతరం తలుపు తెరిచి బయటకు వచ్చిన విజయ్‌.. తన తల్లిని చంపేశానని, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా వారిని నెట్టిసి పారిపోయాడు. స్థానికులు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆర్థిక వివాదాలే హత్యకు దారితీశాయని ప్రాథమికంగా నిర్థారించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాగొచ్చి నాకు తలకొరివి పెట్టకు.. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది.. ఇకనైనా?