Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాదులో థియేటర్లో బాలికపై అత్యాచారం.. బీహార్‌లో కీచకపర్వం

కథువా, ఉన్నావో ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. బాలికలకు రక్షణ కరువైంది. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఎన్ని చట్టాలు వచ్చినా బాలికలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. తాజా

Advertiesment
హైదరాబాదులో థియేటర్లో బాలికపై అత్యాచారం.. బీహార్‌లో కీచకపర్వం
, మంగళవారం, 1 మే 2018 (14:51 IST)
కథువా, ఉన్నావో ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ.. బాలికలకు రక్షణ కరువైంది. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఎన్ని చట్టాలు వచ్చినా బాలికలపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. 
 

తాజాగా హైదరాబాద్‌ బోరబండలోని ఓ సినిమా థియేటర్లో ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం థియేటర్లో తన కుమార్తెపై అత్యాచారం జరిగినట్లు బాధితురాలి తల్లిదండ్రులు మంగళవారం సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఇదిలా ఉంటే.. బీహార్‌లో కీచకపర్వం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై బాలిక పట్ల యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. రోడ్డుపై వెళ్తున్న బాలికను అడ్డగించి.. దుస్తులు తొలగించేందుకు ప్రయత్నించారు. బాలిక ఎదిరించడంతో ఆమె దుస్తులు చింపేశారు. కాలు పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు.

చుట్టూ అందరూ చూస్తుండిపోయారే కానీ.. కేకలు పెడుతున్న బాలికను కాపాడేందుకు ఓ ఒక్కరూ ముందుకు రాలేదు. ఇంకా వీడియోలు కూడా తీసుకున్నారు. జెహానాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు నిందితులపై పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పాట్నా జోనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నయ్యర్ హుస్సైన్ తెలిపారు. వీడియోలోని బైక్ నంబరు ఆధారంగా ఇప్పటి వరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోలపై వాళ్లు అలిగి రాలేదంట... శ్రీరెడ్డి: చిరంజీవి ఏడవలేదు...