అపుడు కాంగ్రెస్.. ఇపుడు బీజేపీ.. నీవు ఎన్టీఆర్ బిడ్డవమ్మా : పురంధేశ్వరికి గుడివాడ వాసి షాక్

స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీమంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి కర్ణాటక రాష్ట్రంలో ఓటరుగా ఉన్న గుడివాస వాసి తేరుకోలేని షాకిచ్చారు. రాయచూరు జిల్లాలో బీజేపీ తరపున ప్రచారం చేసేందు

Webdunia
గురువారం, 3 మే 2018 (13:52 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీమంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి కర్ణాటక రాష్ట్రంలో ఓటరుగా ఉన్న గుడివాస వాసి తేరుకోలేని షాకిచ్చారు. రాయచూరు జిల్లాలో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వెళ్లిన పురంధేశ్వరికి ఈ తెలుగు రైతు తేరుకోలేని ప్రశ్నలు సంధించి ఉక్కిరిబిక్కిరి చేశాడు.
 
ఇంతకీ పురందేశ్వరిని ఆయన ఏమడిగారంటే...'అమ్మా, క్రితంసారి జరిగిన ఎన్నికల్లో కూడా నువ్వు ఇక్కడకు వచ్చి ప్రచారం చేశావ్. అప్పడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నావ్. ఇప్పుడు వచ్చి, బీజేపీకి ఓటేయమంటున్నావ్. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలతోనే ఎప్పుడూ ఎందుకుంటున్నావమ్మా?.. నీవు ఎన్టీఆర్ బిడ్డవమ్మా' అంటూ నిలదీశారు. 
 
అంతేనా... 'మీ స్థానంలో వేరొకరు ఉంటే అడిగేవాడ్ని కాదమ్మా. మాది గుడివాడ తాలూకా. మీ నాన్నగారు టీడీపీ స్థాపించినప్పుడు, పార్టీ జెండా మోశా. ఆ అభిమానంతోనే అడుగుతున్నా' అంటూ తన ప్రశ్న ముగించాడు. ఈ ప్రశ్నకు ఆమె షాక్‌కు గురైంది. ఆ తర్వాత తేరుకుని రాష్ట్రాలని బట్టే పరిస్థితులు మారతాయని, న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయమని చెబుతున్నానని, తనది రాజకీయం కాదని చెప్పి అక్కడ నుంచి ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. మొత్తంమీద కర్ణాటకలో తెలుగు ఓటర్లు బీజేపీతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయం తేటతెల్లమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments