మీడియాలో యాంకర్లుగా బాగా గుర్తింపు తెచ్చుకోవాలంటే పడుకోవాల్సిందే... భాజపా నేత
విలేఖరుల సమావేశానికి వచ్చిన మహిళా విలేఖరి బుగ్గ నిమిరిన తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోపిత్‌కు సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేత ఎస్వీ శేఖర్ ఓ ఉచిత సలహా ఇచ్చారు. పాత్రికేయురాలి బుగ్గ నిమిరిన నేపథ్యంలో ఆయన తన చేతిని ఫినాయిల్‌తో కడుక్కోవాలని సూచన చేశారు.
విలేఖరుల సమావేశానికి వచ్చిన మహిళా విలేఖరి బుగ్గ నిమిరిన తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోపిత్‌కు సినీ నటుడు, బీజేపీ సీనియర్ నేత ఎస్వీ శేఖర్ ఓ ఉచిత సలహా ఇచ్చారు. పాత్రికేయురాలి బుగ్గ నిమిరిన నేపథ్యంలో ఆయన తన చేతిని ఫినాయిల్‌తో కడుక్కోవాలని సూచన చేశారు. ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగలేదు... అసలు లైంగిక వేధింపులు అనేవి మీడియాలో వున్నంతగా ఎక్కడా లేవంటూ పేర్కొన్నారు. యాంకర్‌గా పైకి రావాలన్నా, మీడియాలో మంచి స్థానం సంపాదించాలన్నా బిగ్ షాట్స్ తో పడుకోవాల్సిందేనంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై దుమారం రేగటంతో ఆయన తన పోస్ట్‌ను తొలగించారు. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెన్నై పాత్రికేయులు బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఇటీవల ఓ పత్రికా సమావేశంలో పాత్రికేయురాలు లక్ష్మీ సుబ్రహ్మణ్యం గవర్నర్‌ను ఓ ప్రశ్నఅడిగారు. ఆయన దానికి సమాధానాన్ని దాటవేస్తూ, ఆమె బుగ్గపై నిమిరారు. దీనిని లక్ష్మీ ఖండిస్తూ ట్వీట్ చేశారు. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, తన ఇష్టం లేకుండా, తన బుగ్గపై గవర్నర్ నిమిరారని ఆరోపించారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆమెకు క్షమాపణ చెప్పారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత శేఖర్ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు. మహిళా జర్నలిస్టును ముట్టుకున్నందుకు గవర్నర్ తన చేతిని ఫినాయిల్‌తో కడుక్కోవాలని పేర్కొన్నారు. సాక్షాత్ బీజేపీ నేతగా ఉన్న ఎస్వీ శేఖర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో వివాదాస్పదమైంది. దీంతో ఆయన తన ట్వీట్‌ను తొలగించారు.