Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లు అర‌వింద్‌కి దిమ్మతిరిగే సమాధానంతో షాక్ ఇచ్చిన సినీ పెద్ద‌లు...

టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని తిట్ట‌డంతో మ‌రోసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే... శ్రీరెడ్డితో ఇలా తిట్ట‌మ‌ని చెప్పింది నేనే అంటూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఓ బాంబ్

అల్లు అర‌వింద్‌కి దిమ్మతిరిగే సమాధానంతో షాక్ ఇచ్చిన సినీ పెద్ద‌లు...
, బుధవారం, 25 ఏప్రియల్ 2018 (14:36 IST)
టాలీవుడ్ సెన్సేష‌న్ శ్రీరెడ్డి. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని తిట్ట‌డంతో మ‌రోసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించి వార్త‌ల్లో నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే... శ్రీరెడ్డితో ఇలా తిట్ట‌మ‌ని చెప్పింది నేనే అంటూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఓ బాంబ్ పేల్చ‌డంతో ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ఆ త‌ర్వాత మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్రెస్ మీట్ పెట్టి వ‌ర్మ‌ను తిట్ట‌డం... సినీ పెద్ద‌లు దీనికి స‌మాధానం చెప్పాల‌నీ... డిమాండ్ చేయ‌డం తెలిసిందే. 
 
ఆ త‌ర్వాత రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫిల్మ్ ఛాంబ‌ర్‌కి చేరుకుని నిర‌స‌న తెలియ‌చేయ‌డం.. దీనికి మెగా హీరోలతో పాటు మ‌రికొంతమంది సినీ ప్ర‌ముఖులు స‌పోర్ట్ చేయ‌డంతో చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు అన్న‌పూర్ణ స్టూడియోలో స‌మావేశ‌మై.. కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. ఆ త‌ర్వాత త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ని క‌ల‌వ‌డం తెలిసిందే. అయితే.. అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన స‌మావేశంలో అల్లు అర‌వింద్ ఓ డిమాండ్ చేశారట. ప‌వ‌న్ మ‌ద‌ర్‌ని శ్రీరెడ్డి తిట్టిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేసిన కొన్ని న్యూస్ ఛాన‌ల్స్‌ని బ్యాన్ చేయాల‌న్నార‌ట‌. 
 
అయితే... అల్లు అరవింద్ మాట‌ల‌ను కొంతమంది సినీ ప్ర‌ముఖులు త‌ప్పుప‌ట్టార‌ట‌. ఎందుకంటే... ఓ న్యూస్ ఛాన‌ల్ ఇండ‌స్ట్రీలో ల‌.... లేరా అన్న‌ప్పుడు కొంతమంది సినీ ప్ర‌ముఖులు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఈ స‌మావేశానికి ర‌మ్మ‌ని మెగా ఫ్యామిలీ హీరోల‌ను పిలిచినా ఎవ‌రు రాలేద‌ని.. అలాంటిది ఇప్పుడు ప‌వ‌న్‌ని తిట్టార‌ని న్యూస్ ఛాన‌ల్‌ని బ్యాన్ చేయాలంటే మేము ఎందుకు స‌పోర్ట్ చేయాల‌ని ప్ర‌శ్నించార‌ట‌. ఊహించ‌ని ఈ స‌మాధానాల‌కు అల్లు అర‌వింద్ షాక్ అయ్యార‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అల్లు అర‌వింద్‌కి ఎవ‌రు స‌మాధానం చెప్పారో తెలియ‌దు కానీ... వారి వాద‌న‌లోను.. వాస్త‌వం ఉందనే కామెంట్లు వినబడుతున్నాయి. అదీ..సంగ‌తి..!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోనమ్ కపూర్ వివాహం.. స్విట్జర్లాండ్‌లో కాదు.. ఇంట్లోనే..