Webdunia - Bharat's app for daily news and videos

Install App

#KarnatakaVerdict : సెంచరీ మార్క్ దాటిన బీజేపీ ఆధిక్యం.. కాంగ్రెస్ వెనుకంజ

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Webdunia
మంగళవారం, 15 మే 2018 (09:48 IST)
దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2640 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.
 
ప్రతీ టేబుల్ వద్ద 100 మంది పర్యవేక్షించనున్నారు. 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా, 9 గంటలకల్లా సరళి వెల్లడి కానుంది. మధ్యాహ్నానికి గెలుపెవరిదో తేలిపోతుంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతంలో వంద మీటర్ల వరకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బెంగళూరులో 5 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రతీ కేంద్రంలోనూ 14 టేబుళ్లు ఉన్నాయి. కాగా, బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా పీయూష్ గోయల్ జవదేవకర్ వ్యవహరించనుండగా, కాంగ్రెస్ నుంచి అశోక్ గెహ్లట్, ఆజాద్ ఎన్నికల పరిశీలకులుగా నియమితులయ్యారు.
 
కాగా, ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. అలాగే, ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్ మేరకు కాంగ్రెస్ 60, బీజేపీ 103, జేడీఎస్ 48, ఇతరులు మూడు సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments