Webdunia - Bharat's app for daily news and videos

Install App

#KarnatakaVerdict : బీజేపీ ఆధిక్యం.. కాంగ్రెస్ వెనుకంజ.. కింగ్ మేకర్ జేడీఎస్

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 264

Webdunia
మంగళవారం, 15 మే 2018 (09:43 IST)
దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2640 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.
 
ప్రతీ టేబుల్ వద్ద 100 మంది పర్యవేక్షించనున్నారు. 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా, 9 గంటలకల్లా సరళి వెల్లడి కానుంది. మధ్యాహ్నానికి గెలుపెవరిదో తేలిపోతుంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతంలో వంద మీటర్ల వరకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బెంగళూరులో 5 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రతీ కేంద్రంలోనూ 14 టేబుళ్లు ఉన్నాయి. కాగా, బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా పీయూష్ గోయల్ జవదేవకర్ వ్యవహరించనుండగా, కాంగ్రెస్ నుంచి అశోక్ గెహ్లట్, ఆజాద్ ఎన్నికల పరిశీలకులుగా నియమితులయ్యారు.
 
కాగా, ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. అలాగే, ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్ మేరకు కాంగ్రెస్ 77, బీజేపీ 97, జేడీఎస్ 41, ఇతరులు 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments