Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కంధ షష్ఠి కవచంపై రచ్చ రచ్చ... కరుప్పర్ కూట్టం వ్యక్తి లొంగిపోయాడు..

Webdunia
గురువారం, 16 జులై 2020 (19:04 IST)
Murugan
తమిళనాడులో కొద్దిరోజుల పాటు కరుప్పర్ కూట్టం అనే యూట్యూబ్ ఛానెల్ నానా హంగామా చేసింది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం తమిళనాడులో నిబంధనలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో.. కొత్త కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుమార స్వామిని స్తుతించే స్కంధ షష్ఠి కవచంపై కరుప్పర్ కూట్టం అనే యూట్యూబ్ ఛానెల్ ప్రతికూల ప్రకటన చేస్తూ.. చర్చకు తావిచ్చింది. 
 
ఈ స్కంధ షష్ఠి కవచంలో శరీర అవయవాలపై స్తుతి జరగడంపై కరుప్పర్ కూట్టమ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పుబట్టింది. దీంతో ఈ కవచం చదవడం శుభమేనా అనే సంశయం కుమార స్వామి భక్తుల్లో ఏర్పడింది. కానీ తమిళుల దైవంగా పేర్కొనే కుమార స్వామిని స్తుతిని తప్పుబట్టడంపై కరుప్పర్ కూట్టం ఛానల్‌పై భక్తులు మండిపడ్డారు. 
 
ఇంకా హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కంధ షష్ఠి కవచం వ్యవహారానికి కారణమైన కరుప్పర్ కూట్టమ్ ఛానల్‌కు చెందిన సురేందర్ అనే వ్యక్తి పుదుచ్చేరి పోలీసుల ముందు లొంగిపోయాడు. కొద్ది రోజుల క్రితం కరుప్పర్ కూట్టం అనే యూట్యూబ్ ఛానల్‌లో కుమార స్వామికి చెందిన స్కంధ షష్ఠి కవచంపై అభ్యంతరకరంగా కామెంట్లు చేశారు. 
 
దీనిపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. కరుప్పర్ కూట్టంపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ యూట్యూబ్ ఛానల్‌కు చెందిన సురేందర్ అనే వ్యక్తి పుదుచ్చేరిలో పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని తెలిసింది. మరి ఈ కేసును ఎలా డీల్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments