Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శృంగారం తప్పుకానీ.. నాపై అత్యాచారం చేస్తే పర్లేదా?

Advertiesment
శృంగారం తప్పుకానీ.. నాపై అత్యాచారం చేస్తే పర్లేదా?
, సోమవారం, 8 జూన్ 2020 (13:58 IST)
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ ఏక్తా కపూర్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్‌ని ఎదుర్కొంటుంది. ఇండియన్ ఆర్మీని అవమానించిందని ఆమెపై ట్వీట్ల దాడి చేశారు. తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది ఏక్తా కపూర్. ఏక్తా కపూర్ నిర్మించిన అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌ 2 ట్రైలర్‌లో ఆర్మీని తప్పుగా చూపించారని ఆరోపిస్తూ సైబ్‌ క్రైం విభాగంలో కేసు నమోదైంది. 
 
అన్‌ సెన్సార్డ్‌ సీజన్ 2 ట్రైలర్‌లో ఆర్మీ దుస్తులని, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని, ఆర్మీ అధికారి భార్యకి, వేరే వ్యక్తికి సంబంధం ఉన్నట్టు చూపించారని విశాల్‌ కుమార్ అనే వ్యక్తి సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. 
 
దీనిపై స్పందించిన ఏక్తాకపూర్ భారత ఆర్మీని తామెంతగానో గౌరవిస్తామని చెప్పారు. ఆర్మీ మన దేశానికి వస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ఇప్పటికే ఆ సీన్స్‌ని తొలగించాం. మా వలన ఎవరైన మనోభావాలని దెబ్బతింటే వారికి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అత్యాచార బెదిరింపులు, ట్రోల్స్‌ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏక్తా కపూర్ తెలిపింది. 
 
ఆల్ట్ బాలాజీ యాప్‌లో ఓ సిరీస్‌లో శృంగార స‌న్నివేశాల‌ను చూపించామ‌ని, అది త‌ప్ప‌ని భావిస్తున్నార‌ని, అందుకే కొంద‌రు త‌న‌పై కేసు పెట్టార‌ని.. మ‌రి అత్యాచారం చేస్తే ఓకేనా.. అని ఏక్తా క‌పూర్ ప్ర‌శ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి సర్జా భార్య మేఘనా 4నెలల గర్భవతి.. బిడ్డను చూడకుండానే..?