Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో జోగిని శ్యామల: నా దుస్తులు విప్పి వీడియోలు తీసిందంటూ...

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (11:54 IST)
తెలంగాణాలో బోనాల పండగ సమయంలో ఆటపాటలతో ఆకట్టుకునే జోగిని శ్యామల వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పైన లైంగికంగా మానసికంగా దాడికి పాల్పడిందని ఒక మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో జోగిని శ్యామలపై జీరో సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
 
దైవ దర్శనానికి వెళ్లిన తనపై శ్యామల దాడి చేసి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేసిందని ఆ మహిళ ఆరోపించింది. అంతేకాదు శ్యామలతో పాటు మరో 15 మందిపైన సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తన దుస్తులు విప్పి.. శ్యామల వీడియోలు తీశారని బాధితురాలు ఆరోపించింది. సికింద్రాబాద్ లోని గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న స్రవంతి తన తల్లి సంధ్య ఈ నెల 12న మెదక్ జిల్లా పాపన్నపేట వన దుర్గాభవానీ దేవాలయ దర్శించుకునేందుకు వెళ్లారు.
 
దర్శనం ముగించుకుని తిరిగి వస్తున్న వారిని జోగిని శ్యామల కలిశారు. శ్యామల తాము ఉంటున్న ప్రదేశానికి రావాలంటూ స్రవంతి తన తల్లి సంధ్యను కోరింది. దాంతో వారు జోగిని నివాసానికి వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ 15 మంది పురుషులు మరో మహిళ ఉండటంతో స్రవంతి ఇంట్లోకి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. అయినా జోగిని శ్యామల వినిపించుకోకుండా లోపలి రావాలంటూ అభ్యర్థించడంతో  స్రవంతి తన తల్లి లోనికి వెళ్లారు.
 
ఆ తర్వాత శ్యామల వారిపై దాడికి పాల్పడింది. బట్టలు విప్పి ఫోటోలు వీడియోలు తీసేందుకు ప్రయత్నించింది. తనపై దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసి ఫొటోలు వీడియోలు తీశారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కేసును పాపన్నపేట పోలీసులకు ట్రాన్సఫర్ చేశారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం