Webdunia - Bharat's app for daily news and videos

Install App

#అంతర్జాతీయ పురుషుల దినోత్సవం.. ఎప్పుడు మొదలైందంటే?

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (12:27 IST)
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలా పురుషులకంటూ ఓ రోజు వుంది. పురుషుల గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకునేందుకు, కొనియాడేందుకు ఇలాంటి రోజూ ఒకటుంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రతి ఏటా నవంబరు 19న పాటిస్తారు. అయితే ఈ వేడుకను కొన్ని దేశాల్లో మాత్రమే జరుపుకొంటున్నారు. సుమారు 70 దేశాలు ఏటా ఇంటర్నేషనల్ మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. 
 
ప్రస్తుతం మగవారు అయినా, ఆడవారు అయినా సమాజంలో సమానమే. ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి. నేటి కాలంలో ఇద్దరూ కూడా సమానంగా పనిచేస్తున్నారు ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే, సంసార బాధ్యతలు, బతుకు బండిని ఈడ్చే బాధ్యతలు మగవారిపై కాస్తా ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి. 
 
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఆర్థికంగా ఇంటిని చూసుకునే బాధ్యత వారిపై ఎక్కువగా ఉంటుంది. ఆడవారు ఇంటిల్లిపాది పనులను చక్కబెడితే.. మగవారు ఇంటిని నడిపించే బాధ్యతలు చూసుకుంటారు. కాలక్రమేణా ఇది లింగ వివక్ష లేకుండా మారుతోంది. ప్రతీ ఒక్కరూ ఈ బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు. అలాంటి వారిని గుర్తించి వారి గొప్పతనాన్ని ప్రశంసించడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవ ప్రధాన లక్ష్యం.
 
ఇకపోతే.. పురుషుల దినోత్సవం ఎప్పుడు మొదలైందంటే.. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 1999లో తొలిసారిగా ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’ జరిగింది. అప్పటి నుంచి నవంబర్ 19న ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments