Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ ఫోటోలు నెట్లో పెట్టేస్తా: భార్యకు టోకరా వేసి కోటి కొట్టేశాడు

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (13:13 IST)
డబ్బులు కొట్టేయాలనే ఆలోచన ఉన్న వాళ్లు ఇంట్లో వాళ్ల డబ్బులు కాకుండా బయట వాళ్ల డబ్బులు కొట్టేస్తారు కానీ.. ఓ ప్రబుద్ధుడు భార్య డబ్బులే కొట్టేసాడు. ఆమెను వేధించి మరీ కొట్టేసాడు. అది కూడా వందలో వేలో కాదు.. అక్షరాల కోటీ రూపాయలు. అవును.. భార్య దగ్గర నుంచి కోటీ రూపాయలు కొట్టేసాడు.
 
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... సాప్ట్వేర్ ఇంజనీర్ అయిన భార్యను చిత్రహింసలకు గురి చేసాడు భర్త సంతోష్.
 
 ఇంతకీ ఏం చేసాడంటే... భార్య అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తుంది. ఆమెకు మరొక వ్యక్తి పేరుతో మెసేజ్‌లు పంపి వేధింపులకు గురి చేసాడు భర్త సంతోష్.
 
అలా వేధించి.. అమెరికాలో ఉన్న భార్య దగ్గర నుంచి కోటి రూపాయలు కొట్టేసాడు సంతోష్. మిత్రుడు పేరుతో భార్యకే అశ్లీల వీడియోలు ఫోటోలు పంపి వేధింపులకు గురి చేసాడు. కోటి రూపాయలు పంపించాలని.. లేదంటే ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి... వాటిని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి పంపిస్తాను. తనతో చాట్ చేసిన విషయం... ఇలా మీ ఆయనకు చెప్పేస్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేసాడు.
 
అయితే భర్త సంతోష్ పైన భార్యకు అనుమానం వచ్చింది. అంతే, సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సంతోష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు సైబరాబాద్ మహిళా పోలీసులు. ఈ విధంగా మొగుడు ఆట కట్టించింది భార్య.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments