Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పటేల్ ఆమరణదీక్ష - బ్యాంకు ఖాతాలోని సొమ్ముపై వీలునామా...

గుజరాత్ యువ సంచలనం, పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. రాష్ట్రంలోని పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని, రైతు రుణమాఫీ చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఆయన గత పది రోజులుగా ఆమరణ నిరాహ

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (09:00 IST)
గుజరాత్ యువ సంచలనం, పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. రాష్ట్రంలోని పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని, రైతు రుణమాఫీ చేయాలన్న ప్రధాన డిమాండ్లతో ఆయన గత పది రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది.
 
ఈ తరుణంలో ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను పంచుతూ హార్దిక్ వీలునామా రాశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50 వేల నదదులో తల్లిదండ్రులకు రూ.20 వేలు, పంజ్రపోల్‌ గ్రామంలో ఆవుల షెడ్‌ నిర్మాణానికి రూ.30 వేలు రాశారు. 
 
అలాగే, తన జీవితగాథపై వస్తున్న పుస్తకం 'హూ టుక్‌ మై జాబ్' విక్రయాల ద్వారా వచ్చే రాయల్టీ, తనపై ఉన్న బీమా డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లెలితోపాటు మూడు సంవత్సరాల క్రితం పటీదార్‌ ఉద్యమం జరిగిన వేళ అశువులు బాసిన 14 మందికీ సమానంగా పంచాలని ఆయన వీలునామాలో రాసినట్టు పటీదార్‌ సంఘం అధికార ప్రతినిధి మనోజ్‌ పనారా తెలిపారు. ఒకవేళ ఈ ఆమరణ దీక్షలో తాను మరణిస్తే, కళ్లను దానం చేయాలని కోరారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments