Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

శ్రీరెడ్డీ... మీడియా ముందుకు రా... నేను చూపిస్తా... ఏం చేస్తావో చూస్తా? లారెన్స్

గత కొన్ని రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ దర్శకుడు లారెన్స్ పైన శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తెలిసినవే. తనను లారెన్స్ మిస్ యూజ్ చేశాడని శ్రీరెడ్డి గత కొన్నిరోజులుగా గట్టిగా వాదిస్తూ వస్తోంది. దీనిపై లారెన్స్ ఎట్టకేలకు స్పందించాడు. బహిరంగంగా ఓ ప

Advertiesment
Big Shock to Srireddy
, సోమవారం, 30 జులై 2018 (15:12 IST)
గత కొన్ని రోజులుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ దర్శకుడు లారెన్స్ పైన శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు తెలిసినవే. తనను లారెన్స్ మిస్ యూజ్ చేశాడని శ్రీరెడ్డి గత కొన్నిరోజులుగా గట్టిగా వాదిస్తూ వస్తోంది. దీనిపై లారెన్స్ ఎట్టకేలకు స్పందించాడు. బహిరంగంగా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా లారెన్స్ రాస్తూ... అసలు శ్రీరెడ్డి తనపై చేస్తున్న వ్యాఖ్యలు చాలా చిన్నవి. అసలు వాటిని నేను పట్టించుకోకూడదని అనుకున్నా. కానీ మీడియా మిత్రులు చాలామంది ఇదే విషయంపై తనను పదేపదే ప్రశ్నించడంతో ఇక లాభంలేదు క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇప్పుడు దీనిపై స్పందిస్తున్నాను.
 
శ్రీరెడ్డికి నేను ఒకటే చెప్తున్నాను. శ్రీరెడ్డి వస్తే నేను ఆమెతో కలిసి మీడియా సమావేశానికి హాజరవుతాను. ఆమె చేస్తున్న ఆరోపణ ఏమిటంటే... తనకు ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వడం లేదని. ఛాన్స్ నేనిస్తాను. ఐతే ఓ కండిషన్. మీడియా సమావేశంలో అందరి సమక్షంలో ఆమెకు నేను ఓ సీన్ ఇస్తాను. అలాగే కొన్ని స్టెప్పులు వేయాలని చెపుతాను. శ్రీరెడ్డి కనుకు ఆ రెండు కరెక్టుగా చేస్తే అవకాశం ఖచ్చితంగా ఇస్తాను. మరి దీనికి శ్రీరెడ్డి సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. మరి లారెన్స్ ప్రశ్నపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గదిలో రుద్రాక్షమాల పెట్టి "ఆ" పూజలు చేయడానికి ఫూల్‌ను కాదు : శ్రీరెడ్డికి లారెన్స్ వార్నింగ్