Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడుపెళ్లాం మధ్య బలవంతపు శృంగారం నేరం కాదు : ముంబై కోర్టు

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (14:24 IST)
మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కానేకాదని ముంబై అడిషనల్ సెషన్స్ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. పైగా, భార్య పెట్టిన వేధింపులు కేసులో భర్తకు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసింది. 
 
తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర రాజధాని ముంబై నగరానికి సమీపంలో ఉన్న మహాబలేశ్వర్‌‌కు చెందిన ఓ మహిళకు మరో వ్యక్తితో గత యేడాది నవంబరు 22వ తేదీన వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన నాటి నుంచి ఆ మహిళను.. ఆమె భర్తతో సహా కుటుంబ సభ్యులంతా కలిసి కట్నం కోసం హింసకు గురిచేస్తున్నారట. 
 
అంతేకాకుండా, కట్టుకున్న భర్త కూడా తనకు ఇష్టంలేకపోయినా బలవంతంగా సెక్స్‌లో పాల్గొంటున్నట్టు ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనివల్ల తనకు నడుము కింది భాగంలో పక్షవాతం వచ్చినట్టు తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ క్రమంలో ఆ మహిళ భర్త తనకు ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును తాజాగా ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు విచారించింది. భార్యభర్తల మధ్య బలవంతపు సెక్స్‌ చట్టవిరుద్ధం కాదని ముంబై అడిషనల్‌ సెషన్స్‌ కోర్టు స్పష్టం చేస్తూ భర్తకు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం