Webdunia - Bharat's app for daily news and videos

Install App

62 ఏళ్ల వృద్ధురాలు.. 257 కి.మీ. రయ్ రయ్ మంటూ జీపు నడుపుకుని ఢిల్లీకి..?!

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (11:54 IST)
woman
ఢిల్లీలో రైతులు ఆందోళన జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు దేశ ప్రజలతో పాటు సెలెబ్రిటీల మద్దతు కూడా లభిస్తోంది. రైతులు కరోనా, చలిని లెక్కచేయకుండా ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. తాజాగా చలిని లెక్క చేయకుండా 62 ఏళ్ల బామ్మ జీపు నడుపుకుంటు ఢిల్లీ చేరింది. చలిని వృద్ధులు తట్టుకోలేరని జాగ్రత్తగా చూసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంటారు. 
 
ఎన్నడు లేని విధంగా ఈ సారి చల్లి మరీ తీవ్రంగా ఉంది. అయితే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కేంద్ర పభుత్వం తీసుకువచిచ్చన మూడు నూతన వ్యయసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత 2 నెలలుగా ఢిల్లిలో రైతన్నలు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చర్చలంటూ కాలం వెల్లదీస్తున్నారు. చలి, ఆకలిని లెక్కచేయకుండా వారు ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా 62 ఏళ్ల వృద్ధురాలు తానే స్వయంగా జీపు నడుపుకుంటూ ఢిల్లికి వచ్చి ధర్నాలో పాల్గొంది. 
 
62 ఏళ్ల మంజీత్‌ కౌర్‌ అనే వృద్ధురాలు పంజాబ్‌లోని పటియాలా నుంచి రైతుల నిరసన ప్రాంతమైన సింఘూ వరకు 257 కి.మీ. దూరం తానే స్వయంగా జీపును నడుపుకుంటూ ధర్నాలో పాల్గొని రైతన్నలకు మద్ధతు తెలిపారు. జీపులో మరో ఐదారు మహిళలను తీసుకుని రయ్‌రయ్‌ మంటూ ఢిల్లికి దూసుకొచ్చారు. జీపులో నినాదాలు చేస్తూ మహిళలు రావడంతో సినిమాల్లో ఓ చేజింగ్‌ తలపించింది. ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన మంజీత్‌ దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను చూసిన మరికొందరు మహిళలు సైతం ఢిల్లిదారి పడుతున్నారు.

సంబంధిత వార్తలు

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

బాల్యం నుంచి బాధ్యతకు ఎదిగిన కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ ఆవిషరించిన నితిన్

కమాండింగ్ పర్సనాలిటీ కునాల్ కపూర్ ను స్వాగతించిన విశ్వంభర టీం

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

ఉడికించిన కూరగాయలు ఎందుకు తినాలో తెలిపే 8 ప్రధాన కారణాలు

తర్వాతి కథనం
Show comments