Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త క్రెడిట్ కార్డు పొందాలనుకుంటున్నారా? రూ.250 చెల్లిస్తే చాలు

Webdunia
శనివారం, 26 డిశెంబరు 2020 (11:05 IST)
కొత్త క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకునే వారికి ఇది శుభవార్త. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ యాక్సి్స్ బ్యాంక్ అదిరిపోయే క్రెడిట్ కార్డును కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. దీని పేరు యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డు. ఇదే కాకుండా యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ ప్లస్ క్రెడిట్ కార్డు కూడా ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డు తీసుకున్న వారు పలు ప్రయోజనాలు పొందొచ్చు. 
 
ఈ క్రెడిట్ కార్డును వర్చువల్ క్రెడిట్ కార్డుగా కూడా వాడొచ్చు. ఫ్రీచార్జ్ అకౌంట్‌కు ఆటోమేటిక్‌గానే ఇది యాడ్ అవుతుంది. రెస్టారెంట్లలో యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు నిర్వహిస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. దీని కోసం బ్యాంక్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 వేల రెస్టారెంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫ్రీచార్జ్ ద్వారా జరిపే లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
 
ఈ క్రెడిట్ పొందాలనుకునే వారు కార్డు కోసం రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. దీనికి చార్జీలు అదనం. అలాగే ఈ క్రెడిట్ కార్డు పొందిన వారు ప్రతి సంవత్సరం రూ.250 ఫీజు చెల్లిస్తూ రావాలి. అదే ఫ్రీచార్జ్ ప్లస్ క్రెడిట్ కార్డు తీసుకుంటే రూ.350 ఫీజు చెల్లించాలి. యాక్సిస్ బ్యాంక్ ఫ్రీచార్జ్ క్రెడిట్ కార్డులు తీసుకున్న వారికి బ్యాంక్ రూ.700 విలువైన వెల్‌కమ్ వోచర్లను కూడా అందిస్తోంది. అంటే మీరు రూ.350 పెట్టి కార్డు తీసుకుంటే మీకే రూ.400 వస్తున్నాయని చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments