Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్లు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కడ?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (20:51 IST)
తెలంగాణా రాష్ట్రంలో తహశీల్ధార్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అయితే ఈ హత్య తరువాత ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులైతే తమ స్థానంలో కూర్చోవాలంటేనే వణికిపోతున్నారు. ఏ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఉత్తరప్రదేశ్ లోని బాందాజిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా హెల్మెట్లు ధరించి ఉద్యోగం చేస్తున్నారు.
 
విద్యుత్ శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని విధులు నిర్వహించడానికి ప్రధాన కారణం ఒకటుంది. వారు ఉన్న భవనం పైకప్పు పూర్తిగా శిథిలమైపోవడం.. ఎప్పుడు ఎక్కడి నుంచి పెచ్చులు ఊడి మీదపడతాయో తెలియక పోవడంతోనే తమ ప్రాణాలకు రక్షణగా హెల్మెట్లు తెచ్చుకుని.. వాటిని తలకు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారట. 
 
ఏ విధమైన దుర్ఘటనలు జరిగినా, ప్రాణాలైనా మిగులుతాయి కదా అన్నదే తమ ఉద్దేశమంటున్నారు ఉద్యోగులు. భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments