Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ రికార్డు సృష్టించిన ఆ నంబర్ ప్లేట్.. ధర రూ.122 కోట్లు (వీడియో)

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (19:25 IST)
ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు భారీ మొత్తంలో ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరు. ఈ క్రంమలో ఫ్యాన్సీ నంబర్ల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతుంటాయి. తాజాగా దుబాయ్‌లో ఓ నంబర్ ధర సరికొత్త రికార్డును సృష్టించి, ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 
 
దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ వేసిన వీఐపీ నంబర్‌ ప్లేట్ల వేలంలో ''పీ7'' అనే కారు నంబర్‌ ప్లేట్‌ 55 మిలియన్‌ దిర్హామ్ (సుమారు రూ.122కోట్లు)లకు అమ్ముడు పోయింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన నంబర్‌ ప్లేట్లలో ఇదే అత్యధికం కావడం విశేషం.
 
ఖరీదైన కార్ల నంబర్‌ ప్లేట్లకు సంబంధించి దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఓ వేలం కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లమంది పేదలకు ఆహారం అందించే బృహత్తర కార్యక్రమం కోసం దాదాపు 100 మిలియన్‌ ఏఈడీ (దిర్హామ్‌)లను సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఎమిరేట్స్‌ ఆక్షన్‌ పేరుతో దీన్ని రూపొందించారు. 
 
ఇందులో భాగంగా జుమైరాలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో వేలం కార్యక్రమం నిర్వహించారు. దీన్ని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రారంభించారు. ఇందులో "పీ7" నంబర్‌ ప్లేట్‌ కోసం ఎంతోమంది బిడ్డర్లు పోటీ పడ్డారు. చివరకు 55 మిలియన్‌ దిర్హామ్‌ల వద్ద ఓ వ్యక్తి ఈ నంబర్‌ ప్లేట్‌ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments