Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు మద్యం తాగించి.. రైలుపట్టాలపై పడుకోబెట్టి ప్రియుడితో హత్య చేయించిన భార్య

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2023 (19:12 IST)
ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. కట్టుకున్న భర్తను తన ప్రియుడితో హత్య చేయించింది. భర్తకు పీకల వరకు మద్యం తాగించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణ(35) కూలిపనులకు వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య ఉప్పర వరలక్ష్మి గతేడాది జూన్‌ 30న మాధవరం ఠాణాలో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
అయితే, మృతుడి ఫోన్ కాల్స్ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. నారాయణ రోజూ మద్యం తాగి భార్యను అనుమానిస్తూ, శారీరకంగా, మానసికంగా వేధించేవాడని విచారణలో గుర్తించారు. ఈ నేపథ్యంలో సి.బెళగల్‌ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్నగోవిందుతో వరలక్ష్మికి వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. 
 
దీంతో భర్త వేధింపులు భరించలేని ఆమె.. భర్తను అంతమొందించాలని ప్రియుడితో కలిసి ఆమె ప్రణాళిక రచించింది. పథకం ప్రకారం చిన్నగోవిందు.. నారాయణను కర్నూలుకు తీసుకెళ్లి మద్యం తాగించి రైలుపట్టాలపై పడుకోబెట్టాడు. రైలు పైనుంచి దూసుకుపోవడంతో తలకు తీవ్రగాయాలై నారాయణ చనిపోయారు. చిన్నగోవిందు ఆ విషయాన్ని వరలక్ష్మికి ఫోన్‌లో చెప్పాడు. 
 
ఆ తర్వాత తమ ముందస్తు ప్రణాళికలో భాగంగా,  వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పోలీసుల విచారణలో తామే ఈ హత్య చేసినట్లు వరలక్ష్మి, చిన్నగోవిందు అంగీకరించారు. నిందితులను అరెస్ట్‌ చేసి ఎమ్మిగనూరు న్యాయస్థానంలో హాజరుపరచినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments