Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్పీఎఫ్ సిబ్బంది సహకారం... మాయమైన రైల్వే ట్రాక్.. ఎక్కడ?

railway track
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (11:52 IST)
బీహార్ రాష్ట్రంలో తాజాగా ఓ రైల్వే ట్రాక్ మాయమైంది. ఈ రైల్వే ట్రాక్‌కు కాపలాగా ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది తమ వంతు సహకారం అందించారు. దీంతో బీహార్ రాష్ట్రానికి చెందిన దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఫలితంగా వారు ఏకంగా రైల్వే ట్రాక్‌ను దొంగలించి విక్రయించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నిద్రమత్తు వీడిన అధికారులు ఈ రైల్వే ట్రాక్‌కు కాపలాగా ఉన్న ఇద్దరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ సిబ్బందిపై వేటు వేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలోని బెలాహీలో లోహత్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ రవాణా సదుపాయం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ ఓ ట్రాక్‌ను నిర్మించింది. కొంతకాలంపాటు ఉపయోగంలో ఉన్న ఈ రైల్వే ట్రాక్ ఉపయోగంలో ఉన్నది. ఆ తర్వాత షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. దీంతో గత 20 యేళ్లుగా ఈ రైల్వే ట్రాక్ నిరుపయోగంగా మారడంతో రైల్వే సిబ్బంది, అధికారులు కూడా ఈ ట్రాక్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. 
 
ఇలా నిరుపయోగంగా మారిన ట్రాక్‌ను రైల్వే శాఖ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచ్ స్క్రాప్ కింద అమ్మేయాల్సి వుంది. కానీ, రైల్వే అధికారులు మాత్రం అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. ట్రాక్ మాయమైన విషయం వెలుగులోకి రావడంతో అధికారులు మేల్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఆర్పీఎఫ్ సిబ్బందితో చేతులు కలిపిన దొంగల ముఠా ఈ ట్రాక్‌‍ను దొంగిలించి అమ్మేసి సొమ్ము చేసుకున్నట్టు తేలింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సీరియస్ కావడంతో రైల్వే అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఇందులోభాగంగా, రైల్వే ట్రాక్‌ను అమ్మి సొమ్ము చేసుకునేందుకు సహకరించిన ఇద్దరు ఆర్బీఎఫ్ జవాన్లపై వేటు వేశారు. విచిత్రమేమింటే.. అక్కడ రైల్వే ట్రాక్ ఉండేదనే ఆనవాళ్లు కూడా లేకుండా చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరిగిపడిన కొండచరియలు.. 36 మంది మృత్యువాత