ఐస్‌క్రీమ్‌లో కప్ప వుండటం చూడకుండా తిన్న చిన్నారులు అస్వస్థతకు గురైనారు. ఈ ఘటన తమిళనాడు మధురైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధురై కోవలన్ నగర్ మణిమేగల వీధికి చెందిన అన్బుసెల్వం. ఆయన భార్య జానకిశ్రీ.కుమారస్వామి ఆలయానికి వెళ్లారు. ఆయన తన కుమార్తెలు మిత్రశ్రీ (వయస్సు 8), రక్షణశ్రీ (7), ధరణి (4)లను కూడా వెంట తీసుకెళ్లాడు.
ఆ తర్వాత గుడి సమీపంలోని శీతల పానీయాల దుకాణంలో పిల్లలకు జిగర్తాండను కొనుగోలు చేశాడు. ఇది తాగిన ముగ్గురు చిన్నారులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన జానకిశ్రీ పిల్లలు తాగే జిగర్తాండను కొనుగోలు చేసింది.
అప్పుడు అందులో ఉంచిన ఐస్‌క్రీమ్‌లో ఒక కప్ప చనిపోయి పడి ఉంది. అనంతరం వాంతులు చేసుకున్న ముగ్గురు చిన్నారులను సమీపంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్యులు చికిత్స అందించారు
ఐస్‌క్రీమ్‌లో కప్ప పడి ఉండడంపై జానకిశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శీతల పానీయాల దుకాణం యజమాని దురైరాజన్ (60)ని పోలీసులు అరెస్ట్ చేశారు.