Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కప్పలకు విడాకులు... ఇదేంటి అనుకుంటున్నారా... ?

Advertiesment
Frog
, గురువారం, 21 జులై 2022 (22:59 IST)
కప్పలకు విడాకులు... ఇదేంటి అనుకుంటున్నారా... అవును ఇది నిజమే. వర్షాలు కురవక పోతే కప్పలకు పెళ్ళి చేస్తారు. అవే వర్షాలు భారీగా కురిస్తే... పెళ్లి చేసిన కప్పలను విడదీస్తారు. అంటే ఆ కప్పలకు విడాకులు ఇస్తారు. 
 
కప్పలకు పెళ్లి చేయటానికి వరణుడే కారణం..వాటికి విడాకులకు కూడా వరుణుడే కారణం కావటం వింతనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. భారత దేశంలోని కొన్ని గ్రామాల్లో రెండు కప్పలను తెచ్చి వాటికి పెళ్ళి చేస్తారు. ఊరంతా వాటిని ఊరేగిస్తారు. ఆ తరువాత వాటిని దగ్గర్లోని చెరువులల్లో విడిచి పెడతారు. 
 
ఇలా చేయడం ద్వారా వరుణ దేవుడు కరుణించి.. వర్షాలు కురుస్తాయని ప్రజలు నమ్ముతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో.. కప్పలకు విడాకులు కూడా ఇస్తారు. ముఖ్యంగా భోపాల్‌లో ఈ కప్పల విడాకుల పద్ధతి భలే వింతగా ఉంటుంది. 
 
రెండు కప్పలను పట్టుకుని వాటిలో ఆడకప్పకు ఓ రకం బట్టలు, మగ కప్పకు ఓ రకం బట్టలు వేస్తారు..ఆడ కప్పకు పసుపు కుంకుమ పెడతారు. కాసేపటికి వాటిని పెళ్లి చేసినప్పుడు ఒకే చెరువులో వదిలిస్తారు. విడాకుల తరువాత వేరు వేరు చెరువుల్లో వదులుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాంసం ధరలకు మహిళల తొడలకు సంబంధం వుందా?