Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాస్తిక నేత కరుణానిధి స్వర్గ ప్రాప్తినా? వేదపండితులేమంటున్నారు...

తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణాని

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:23 IST)
తన జీవితంలో భగవంతుడిని నమ్మని పరమ నాస్తికుడిగా పేరు తెచ్చుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి స్వర్గానికి వెళ్లారని తమిళనాడు పండితులు చెబుతున్నారు. నాస్తికవాది అయిన కరుణానిధి ఏకాదశి (మంగళవారం) సాయంత్రం మృతి చెందటం, ద్వాదశి (బుధవారం)నాడు ఖననం చేయడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందని పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.
 
నిజానికి ఏకాదశినాడు సూర్యాస్తమయం వేళ మరణించడం, ద్వాదశి ఘడియల్లో అంత్యక్రియలు జరగడంతో ఆయనకు స్వర్గ ప్రాప్తి లభించిందని, ఇటువంటి భాగ్యం అందరికీ లభించదని అంటున్నారు. నాస్తికుడైన కరుణ అరుదైన అదృష్టానికి నోచుకున్నారని చెబుతున్నారు. ఆయనకు మోక్షప్రాప్తి కలగాలని చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం రాజగోపురంపై పూజారులు మోక్ష దీపాలను కూడా వెలిగించడం గమనార్హం. 
 
ఇంకోవైపు, కరుణానిధిపై దాఖలైన 13 పరువునష్టం కేసులను కొట్టి వేస్తూ చెన్నై ప్రిన్సిపల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులన్నీ దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన కేసులు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments