Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చివరిసారిగా ''అప్పా'' అని పిలిచేనా? తండ్రికి స్టాలిన్ భావోద్వేగ కవిత..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణవార్త తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. డీఎంకే కార్యకర్తలను శోకసంద్రంలో ముంచేసింది. ఇక కరుణ తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌కు తీవ్ర ఆవేద

Advertiesment
చివరిసారిగా ''అప్పా'' అని పిలిచేనా? తండ్రికి స్టాలిన్ భావోద్వేగ కవిత..
, గురువారం, 9 ఆగస్టు 2018 (09:16 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణవార్త తమిళనాడు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. డీఎంకే కార్యకర్తలను శోకసంద్రంలో ముంచేసింది. ఇక కరుణ తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌కు తీవ్ర ఆవేదనకు దారితీసింది. తన తండ్రి ఇక లేరనే వార్త ఆయన్ని విషాదంలో ముంచింది. చివరిసారిగా తన తండ్రి కోసం స్టాలిన్ రాసిన కవిత తమిళ ప్రజల కంట నీరు తెచ్చేలా చేసింది. 
 
కరుణానిధిని అప్పా (నాన్నా) అని పిలచేకంటే.. లీడర్‌ అని పిలవడమే తనకిష్టమని ట్వీట్టర్లో స్టాలిన్ పేర్కొన్నారు. తన జీవితాంతం.. కరుణానిధిని లీడర్‌గానే కొలుస్తానని అన్నారు. అయినా చివరిసారిగా అప్పా అని పిలవనా అంటూ స్టాలిన్‌ చేసిన ట్వీట్ పుత్ర వాత్సల్యానికి నిదర్శనంగా నిలిచింది.
 
ఇంతకాలం మిమ్మల్ని అప్పా అని కాకుండా తలైవరే అనే ఎక్కువసార్లు పిలిచాను. చివరిసారిగా ఒక్కసారి మిమ్మల్ని అప్పా అని పిలవచ్చా తలైవరే. తమిళ రాష్ట్ర సంక్షేమం కోసం మీరు చేసిన సేవ పూర్తైందనుకుని వెళ్లిపోయారా. మీరు ఎక్కడికి వెళ్లినా నాకు చెప్పకుండా వెళ్లేవారు కాదు. 
 
కానీ ఈ సారి ఎందుకు చెప్పకుండా వెళ్లిపోయారు? ఒక్కసారి నా ప్రియమైన సోదరులారా.. అని మమ్మల్ని పిలవండి. ఆ పలుకే మరో శతాబ్దం వరకు కలిసి పోరాడేందుకు మాకు శక్తినిస్తాయి.. అంటూ స్టాలిన్ రాసిన కవిత డీఎంకే కార్యకర్తలు, నేతలు, ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'అన్నా' పక్కనే సేదతీరిన 'సూరీడు'... ముగిసిన కరుణ మహాప్రస్థానం