కరుణ మృతదేహం.. ఇంటికొచ్చినా.. ఆకాశాన్ని చూస్తుండిపోయిన రెండో భార్య..?
రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి శకం బుధవారంతో ముగిసింది. రాజకీయ రంగంలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన కరుణానిధి.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు సా
రాజకీయ కురువృద్ధుడు, డీఎంకే అధినేత కరుణానిధి శకం బుధవారంతో ముగిసింది. రాజకీయ రంగంలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన కరుణానిధి.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు సాధించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయనకంటూ ఓటమిలేదు.
రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన నాయకుడు కలైంజ్ఞర్. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 1957 నుంచి 13సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కరుణానిధికి సీఎంగా ప్రత్యేక స్థానం ఉంది.
దాదాపు 14 మంది ప్రధానులతో సత్సంబంధాలను కొనసాగించారు. అంతేకాదు దేశానికీ స్వాతంత్ర్యం వచ్చిన తరువాతనుంచి ఇప్పుడు పనిచేస్తున్న ప్రధానుల వరకు అందరితో పరిచయాలున్న ఏకైన రాజకీయ నాయకుడు కేవలం కరుణానిధే. దేశంలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి రాజకీయ వేత్త కరుణానిధి కావడం గమనార్హం. అలాంటి నేత మహాప్రస్థానం బుధవారంతో ముగిసింది.
ఈ నేపథ్యంలో కరుణ ఇక లేరనే వార్త విని తమిళనాడు మూగబోయింది. తమిళ ప్రజల గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రబలేలా చేసిన కరుణ ఇక లేరనే వార్తతో అందరూ షాక్ తిన్నారు. అయితే కరుణ మరణ వార్త.. ఆయన జీవిత భాగస్వామి రెండో సతీమణి దయాళు అమ్మాళ్‌కు తెలియదు. కరుణ లేరని, తిరిగి రారని చెప్పినా ఆమెకు అర్థం కాదు. కారణం ఆమె రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో వున్నారు.
కళ్ల ముందు గ్రహించేదేన్నీ గుర్తించలేని స్థితిలో ఆమె వున్నారు. ఆమె జ్ఞాపకశక్తి కూడా దెబ్బతింది. భర్త ఆఖరి మజిలీకి చేరుకున్నా ఆమె ఎప్పటిలానే ఆకాశం వైపు చూస్తూండిపోయింది. గత వారంలో కరుణానిధి ఆసుపత్రిలో మృత్యుదేవతతో పోరాడుతున్న వేళ, దయాళు అమ్మాళ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చిన అళగిరి, కాసేపు ఆసుపత్రిలో కరుణ ముందు ఉంచి తీసుకెళ్లారు.
ఆపై మంగళవారం ఆయన మరణించగా, గోపాలపురంలోని ఇంట్లోకి పార్థివ దేహాన్ని తీసుకెళ్లినప్పుడు ఆమె ఇంట వుంట వుండినా ఏమీ గుర్తించలేకపోయింది. అందువల్లే మెరీనా బీచ్‌లో జరిగిన అంత్యక్రియలకు ఆమెను తీసుకురాలేదు. మూడో భార్యా రాజాత్తి అమ్మాల్ మాత్రమే కరుణ అంత్యక్రియలకు హాజరయ్యారు.