శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి మ్రొక్కులు తీర్చుకున్న భక్తుడు.. ఎలా సాధ్యం..?

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:00 IST)
తిరుమల శ్రీవారి ఆలయం అంటేనే ఎంతో భద్రత. అందులోను నిషేధిత వస్తువులు తీసుకెళ్ళకుండా టిటిడి విజిలెన్స్, నిఘాతో పాటు పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అలాంటి తిరుమలలో ఏకంగా ఒక తమిళ భక్తుడు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఫోటోతో ఆలయంలోకి వెళ్ళిపోయాడు. అది కూడా పార్టీ కండువాకు ఆలయానికి వెళ్ళి దర్సనం చేసుకున్నాడు. 
 
కడలూరుకు చెందిన ఆరూల్ జ్యోతి అనే భక్తుడు పార్టీ కండువా, శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయ ప్రవేశ చేయడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. అది కూడా శశికళ జైలు నుంచి బయటకు రావాలని, ఆమె సిఎం కావాలంటూ మ్రొక్కులు తీర్చుకున్నట్లు ఆలయం బయటకు వచ్చిన ఆ భక్తుడు మీడియాకు చెప్పాడు. దీంతో మీడియా ప్రతినిధులే అవాక్కయ్యారు.
 
తమిళ భక్తుడిని వెంటనే టిటిడి విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భక్తుడు పార్టీ కండువా, ఫోటోలతో ఎలా లోపలికి ప్రవేశించాడన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. టిటిడి ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments