కరోనా వైరస్‌‌కు‌ చెక్ పెట్టే మంత్రం..''ఓం తారే తుత్తారే తురే సోహా'': దలైలామా (video)

బుధవారం, 29 జనవరి 2020 (11:02 IST)
చైనాను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బౌద్ధ మత గురువు దలైలామా ఓ మంత్రాన్ని ఉచ్ఛరించాలని పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చైనాలో కరోనా వైరస్ కారణంగా మరణించేవారి సంఖ్య వందకు పైగా పెరిగిపోతోంది. అలాగే ఐదువేల మందికి పైగా కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. 
 
ఈ వైరస్ ధాటికి జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వైరస్‌కు ఇంకా మందులు కనిపెట్టేందుకు వైద్యులు, పరిశోధకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చైనీయులు ఓ మంత్రాన్ని ఉచ్ఛరించాలని బుద్ధ మత గురువు దలైలామా తెలిపారు. 
 
దీనిపై తన ఫేస్‌బుక్‌లో ఈ మంత్రాన్ని పోస్టు చేశారు. ''ఓం తారే తుత్తారే తురే సోహా'' అనే మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ వుంటే కరోనా వైరస్ వ్యాపించదని పేర్కొన్నారు. దలైలామా పేర్కొన్న ఆ మంత్రం ప్రస్తుతం చైనాలో వైరల్ అవుతోంది.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హైదరాబాద్‌లో దారుణం.. ఇంట్లో ఒంటరిగా వున్న బాలికపై రోజూ అత్యాచారం..