మిల్కీ బాయ్‌తో పెళ్ళంట.. నవ్వుకున్న మహేష్ బాబు- video

శుక్రవారం, 17 జనవరి 2020 (18:42 IST)
సంక్రాంతి బ్లాక్‌బస్టర్ సరిలేరు నీకెవ్వరు టీం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రిన్స్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో పాటు సినీనటి విజయశాంతి, దర్శకుడు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, రాజేంద్రప్రసాద్, ఇతర చిత్ర బృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
 
దర్సనానంతరం ఆలయం బయటకు వస్తున్న మహేష్ బాబుతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీలు పడ్డారు. కొంతమంది యువతులు సినిమా డైలాగ్ చెబుతూ మిల్కీ బాయ్‌తో పెళ్ళంట అంటూ గట్టిగా అరిచారు. దీంతో మహేష్ బాబు వారి మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు.
 
విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌లతో కూడా ఫోటోలను తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. అయితే టిటిడి విజిలెన్స్ సిబ్బంది ఫోటోలు తీసుకోనీయకుండా భక్తులను పక్కకు పంపేశారు. కొంతమంది భక్తులు దూరం నుంచి తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలను తీసుకుంటూ కనిపించారు. సినిమా హిట్ కావడంతో సినీ యూనిట్ తిరుమల శ్రీవారిని దర్సించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా తాను నటించిన సినిమా హిట్ అయితే మహేష్ బాబు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ వస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మామకు చెక్ పెట్టిన అల్లుడు... గగ్గోలు పెడుతున్న దర్బార్ నిర్మాత