కోలీవుడ్‌లో సంక్రాతి వార్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మామా అల్లుళ్ళ వార్ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆ మామా అల్లుళ్లు ఎవరో కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్, ఆయన అల్లుడు ధనుష్. ఈ ఇద్దరూ నటించిన చిత్రాలు సంక్రాతి బరిలో నిలిచాయి. రజినీకాంత్ "దర్బార్" చిత్రంతోనూ, ధనుష్ "పటాస్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే, కలెక్షన్ల పరంగా ధనుష్ చిత్రం ఓహో అంటూ దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో దర్బార్ నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు.
రజినీకాంత్ - మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'దర్బార్'. ఈ చిత్రం జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో నయనతార హీరోయిన్ కాగా, నివేదా థామస్ రజినీ కుమార్తెగా నటించింది. ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది.
ఈ నేపథ్యంలో మామకు సవాల్ విసురుతూ అల్లుడు ధనుష్ కూడా సంక్రాంతి బరిలోకి దిగారు. ఈయన నటించిన 'పటాస్' చిత్రం ఈనెల 15వ తేదీన విడుదలైంది. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం చేసింది. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా, సూపర్ హిట్ టాక్‌తో బొమ్మ దద్దరిల్లిపోతోంది.
దీంతో 'దర్బార్'కు కలెక్షన్లు తగ్గిపోయాయి. అంటే ఈ చిత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఫలితంగా ఈ రెండు చిత్రాలు పోటీపడుతూ నువ్వానేనా అంటూ సాగిపోతున్నాయి. మొత్తంమీద మామకు అల్లుడు గట్టిపోటీనే ఇస్తున్నాడనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.