Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగా ఇంటా సంక్రాంతి సంబరాలు... ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు

Advertiesment
#Sankranthi2020 Special
, బుధవారం, 15 జనవరి 2020 (14:27 IST)
సంక్రాంతి పండుగ సమయంలో ప్రతి ఇంట్లో సందడి అంతా ఇంతా కాదు. ఈ పండుగ ప్రతి ఇంటా కొత్త కాంతులను తీసుకొస్తుంది. ఇపుడు మెగాస్టార్ ఇంట కూడా ఇలాంటి కాంతులనే తీసుకొచ్చింది. సంక్రాంతి పండుగ రోజున మెగాస్టార్ ఇంటికి మెగా ఫ్యామిలీ హీరోలంతా తరలివెళ్లారు. వీరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ కూడా ఉన్నారు. పైగా, వీరంతా ఒకే ఫ్రేములో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 
 
ప్రతి యేటా సంక్రాంతి పడుగ వేళ సామాన్యుల నుంచి సెలబ్రిటీల ఇంట సందడి నెలకొంటుంది. ఈ సంక్రాంతి రోజున ఎన్నడూలేనివిధంగా మెగాస్టార్ చిరంజీవి సహా మెగా హీరోలందరూ ఒక్కచోట చేరి వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన సందడి చేస్తోంది. 
 
ఈ సంక్రాంతి సంబరాల్లో మెగాస్టార్ చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. అలాగే, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, కల్యాణ్ దేవ్ ఉన్నారు. అలాగే, పవన్ కల్యాణ్ తనయుడు అకీరా కూడా తన సీనియర్ కుటుంబసభ్యులతో ఫొటోలో తొలిసారి దర్శనమివ్వడం గమనార్హం. మొత్తమ్మీద మెగా హీరోలందరినీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూడడం అభిమానులకు కనులవిందేనని చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ దర్శకుడు మోసం చేశాడంటున్న నయనతార...