హ్యాట్రిక్ బన్నీ... కలిసివచ్చిన సంక్రాంతి సెంటిమెంట్

మంగళవారం, 14 జనవరి 2020 (11:19 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల వైకుంఠపురములో అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే హీరోయిన్, టబు, జయరామ్, సముద్రఖని, సుశాంత్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. జనవరి 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 
 
ఈ క్రమంలో బన్నీ ఖాతాలో హ్యాట్రిక్ చేరింది. అంటే బన్నీకి సంక్రాంతి బాగా కలిసివచ్చింది. గతంలో దేశ ముదురు చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రంలో బన్నీ అతిథి పాత్రలో నటించాడు. ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో నిలిచి గెలిచింది. ఇపుడు బన్నీ హీరోగా నటించిన అల వైకుంఠపురములో చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
అలాగే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో కూడా ఇది హ్యాట్రిక్కే. గతంలో వచ్చిన జులాయ్, ఆ తర్వాత వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు సూపర్ హిట్లు. ఇపుడు ఈ చిత్రం కూడా విజయం సాధించడంతో హ్యాటిక్ కాంబినేషన్‌గా నివితింగి, అలాగే, త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఎస్. థమన్, నిర్మాత చినబాబు కాంబినేషన్‍‌లో కూడా ఇది హ్యాట్రిక్కే కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'సరిలేరు నాకెవ్వరు' అంటున్న ప్రిన్స్ మహేష్.. అరుదైన రికార్డు... ఏంటది?