Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్ 'పెద్దోడు' అవుతున్నాడని ఓర్వలేకపోతున్న శివసేన?

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (13:30 IST)
సోనూ సూద్... ఈ పేరు చెబితే ఇపుడు దేశంలో చాలామంది మనసున్న మారాజు అని చెపుతుంటారు. సోనూ కష్టాల్లో వున్నవారిని ఆదుకునేందుకు తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టి మరీ సాయం చేస్తున్నారు. అభినవ కర్ణుడుగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర పాలక పార్టీ మండిపడుతున్నట్లు భోగట్టా.
 
సోనూ సూద్‌కి క్రమంగా ప్రజల్లో మంచి పేరు వస్తోంది. ఆయన చేసే మంచి పనులు కారణంగా ఎక్కడికెళ్లినా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఆయన నివాసం వుంటున్న ముంబైలో అయితే పేదలకు చేతనైన సాయం చేస్తూ వారితో దేవుడు అని పిలిపించుకుంటున్నాడు.
 
కాగా ఆయన ముంబైలో వున్న తన నివాస బహుళ అంతస్తుల భవనాన్ని హోటల్‌గా మార్చారు. దానిపై వచ్చే ఆదాయం ఎంతనేది పక్కనపెడితే, నివాస భవనాన్ని హోటల్‌గా మార్చడంపై బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆ భవనానికి నోటీసులు పంపించారు. దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ... తను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదనీ, అన్ని అనుమతులు వున్నాయని చెప్పారు. ఒకే ఒక్కటి రావాల్సి వుందనీ, త్వరలో వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇదిలావుంటే... సోనూ సూద్ కి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో శివసేన ఓర్వలేకపోతుందని సోనూ ఫ్యాన్స్ కొందరు విమర్శిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments