Webdunia - Bharat's app for daily news and videos

Install App

బర్డ్ ఫ్లూ ఎఫెక్టు : హస్తిలో కేజీ చికెన్ ధర రూ.15 మాత్రమే

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (13:17 IST)
దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఈ వైరస్ దెబ్బకు లక్షలాది కోళ్ళు మృత్యువాతపడుతున్నాయి. దీంతో చిక్కెన్ ధరలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. 
 
నిజానికి బ‌ర్డ్ ఫ్లూ సోకినప్పటికీ చికెన్ తినొచ్చ‌ని వైద్యులు చెబుతున్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు వాటిని కొనేందుకు ఆస‌క్తి చూప‌ట్లేదు. బ‌ర్డ్ ఫ్లూ విజృంభ‌ణ కార‌ణంగా హ‌ర్యానాలోని జింద్ జిల్లా నుంచి ఢిల్లీకి కోళ్ల త‌ర‌లింపుపై తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డింది. ఢిల్లీలో కిలో కోడి మాంసం ఖరీదు రూ.15కు పడిపోవ‌డం గ‌మ‌నార్హం.
 
జింద్ జిల్లా నుంచి రోజుకి సుమారు నాలుగు లక్షల కోళ్లను విక్రయానికి తరలిస్తుంటారు. వాటి ధ‌ర ఒక్క‌సారిగా ప‌డిపోవ‌డంతో కోళ్ల వ్యాపారులు ప్రతిరోజూ సుమారు కోటీ 20 లక్షల రూపాయలు నష్టపోతున్నారు. జింద్ జిల్లాలో పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌కు మంచి పేరుంది. 
 
ఆ జిల్లాలో 500కు పైగా పౌల్ట్రీ ఫారాలు, 80కి పైగా హ్యాచరీలు ఉంటాయి. అక్క‌డి నుంచి ఢిల్లీకి విక్రయించే కోళ్ల‌ బరువు సుమారు 8 లక్షల కిలోగ్రాములుంటుంది. కాగా, చికెన్ ను బాగా ఉడికించి తినడం వల్ల న‌ష్ట‌మేమీ ఉండ‌ద‌ని వైద్యులు అంటున్నారు. 
 
కాగా, ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని ఆలప్పుళ, కొట్టాయం వంటి జిల్లాల్లో చికెన్‌తో పాటు కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెల్సిందే. అలాగే, కేరళ నుంచి దిగుమతి అయ్యే కోళ్ళు, కోళ్ళ దాణాపై కూడా నిషేధం విధించారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments