Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటాతో కలిసి 16న ఢిల్లీ వెళ్లనున్న చిరంజీవి, గంటా కోసమా లేక సైరా కోసమా?

Webdunia
సోమవారం, 14 అక్టోబరు 2019 (17:55 IST)
మెగాస్టార్ చిరంజీవి సోమవారం నాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిసిన విష‌యం తెలిసిందే. ఏపీ క్యాపిటల్ ప్రాంతంలోని సీఎం నివాసానికి చిరంజీవి, ఆయన భార్య సురేఖ వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిలు చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా చిరంజీవి శాలువాతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సత్కరించి, బొకే ఇవ్వ‌గా జ‌గ‌న్ చిరంజీవిని శాలువా స‌త్క‌రించారు. ఇదిలావుంటే... నెల 16న చిరంజీవి, గంటా శ్రీనివాస్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లి ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుని క‌ల‌వ‌నున్నారు అని తెలిసింది. 
 
ఎందుకంటే.. చారిత్రాత్మ‌క చిత్రం సైరా సినిమాని వీక్షించాల‌ని కోరేందుకు అని స‌మాచారం. అస‌లు ఈ రోజే గంటా శ్రీనివాస్‌తో క‌లిసి ఢిల్లీ వెళ్లాల్సి వుంది. అయితే.. పార్టీ మారే ఆలోచ‌న‌లపై గంటా శ్రీనివాస్‌కి ఇంకా క్లారిటీ రాలేదు. అందుచేత 16న వెంక‌య్య‌నాయుడుని క‌ల‌వ‌డంతో పాటు.. ప్ర‌ధానిని కూడా చారిత్రాత్మ‌క సినిమాని చూడ‌మ‌ని కోరేందుకు గాను అపాయింట్మెంట్ తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.
 
ఇదిలావుంటే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతూ వున్న సంగతి తెలిసిందే. కొందరు ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతుంటే మరికొందరు భాజపాలోకి వెళ్తారని అంటున్నారు. చిరంజీవి ప్రధానమంత్రిని కలవనున్నారన్న వార్తల నేపధ్యంలో గంటాకు భాజపా తీర్థం ఇప్పించడంలో సైరా నరసిహారెడ్డి సాయం చేస్తారేమోనన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మొత్తమ్మీద చిరంజీవితో గంటా శ్రీనివాసరావు కలిసి వెళ్లడమైతే చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments