Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కో ఉద్యోగికి రూ.70 కోట్లు బోనస్‌గా పంచిన కంపెనీ.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (11:07 IST)
త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అనేక టెక్ కంపెనీలు తమవద్ద పనిచేసే ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. కానీ, చైనాకు చెందిన క్రేన్ తయారీ సంస్థ మాత్రం ఏకంగా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ఆ బోనస్ కూడా వందల్లో వేలల్లో కాదు.. ఏకంగా కోట్లలో ఉండటం ప్రతి ఒక్కరూ నోరు వెళ్లబెట్టేలా చేసింది.
 
చైనాకు చెందిన హెనాన్ మైన్ అనే కంపెనీ క్రేన్ల తయారు చేస్తుంది. గత యేడాది కరోనా కారణంగా పలు కంపెనీలు ఆర్థికంగా తీవ్రమైన నష్టాలను చవిచూశాయి. కానీ, హెనాన్ మైన్ సంస్థకు మాత్రం భారీ లాభాలను అర్జించింది. దీంతో కంపెనీ లాభాలకు కారణమైన ఉద్యోగులకు బోనస్ ఇవ్వాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. 
 
అందులోభాగంగా కంపెనీ సేల్ విభాగంలో మంచి పనితీరు కనబరచిన 30 మందికి పైగా ఉద్యోగులకు 61 మిలియన్ యునాన్లు (భారత కరెన్సీలో రూ.73 కోట్లు) బోనస్‌గా ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఉద్యోగులకు పంచేందుకు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఇందులో రూ.73 కోట్లను నగదు నోట్ల కట్టల రూపంలో అందజేసింది. 
 
మరో ముగ్గరు ఉద్యోగులకు రూ.6 కోట్లు, మిగిలిన ఒక్కొక్కరికీ ఒక మిలియన్ యువాన్లు (రూ.1.20 కోట్లు) బోనస్‌గా ఇచ్చింది. దీంతో కంపెనీ అందించిన నోట్ల కట్టలను ఉద్యోగులు చేతులతో తీసుకెళుతున్న వీడియోలను చైనా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments