Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాకపుట్టిస్తున్న అమరావతి.. నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ!

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి అంశం కాకపుట్టిస్తుంది. నవ్యాంధ్రకు రాజధానిగా ప్రకటించిన అమరావతిని అభివృద్ధి చేయాలంటూ లోగడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీన్ని వైకాపా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ సర్కారు పేర్కొంది. అందువల్ల హైకోర్టు తీర్పు స్టే విధించాలని కోరింది. 
 
మరోవైపు, రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను వేశారు. ఒకేచోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చూడాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. ఈ పిటిషన్‌లు అన్నింటిపై మంగళవారం విచారణ జరుపనుంది. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించనుంది. 
 
దీంతో సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందనే విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఆరు నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం, మరో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్‌లు తమతమ వాదనలు వినిపించనున్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments