పాకిస్థాన్ ఏకాకి.. తాటాకు చప్పుళ్లు వద్దంటున్న చైనా - ఎమిరేట్స్ దేశాలు

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (14:36 IST)
కాశ్మీర్ వ్యవహారంలో భారత్ దూకుడు ప్రదర్శిస్తుంటే దాయాది దేశం పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని, ఈ విషయంలో తలదూర్చలేని పలు ప్రపంచ దేశాలు స్పష్టం చేశాయి. కానీ, పాకిస్థాన్ మాత్రం తాటాకు చప్పుళ్లు చేస్తోంది. ఇది అంతర్గత వ్యవహారం కాదనీ, అంతర్జాతీయ అంశమంటూ గగ్గోలు పెడుతోంది. అయితే, పాకిస్థాన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలంటూ కాళ్లావేళ్లాపడుతోంది.
 
తాజాగా చైనాను సంప్రదించారు. కాశ్మీర్ విషయంలో జోక్యం చెసుకోవాలంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీ విజ్ఞప్తి చేశారు. అదీ కూడా తక్షణం స్పందించాలంటూ కోరారు. ఆయన వినతిని చైనా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, దక్షిణాసియాలో శాంతి నెలకొనేలా చూడాలని ఇరు దేశాలను మాత్రమే కోరగలమని చైనా తేల్చి చెప్పింది. 
 
అలాగే, ముస్లిం దేశాలు కూడా పాకిస్థాన్‌కు వంతపాడటానిక ముందుకురాలేదు. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత వ్యవహారమని, తాము ఏమీ చేయలేమని అరబ్ ఎమిరేట్స్ దేశాలు తేల్చి చెప్పాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇదే  తరహా వైఖరిని వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దీంతో కాశ్మీర్‌తో పాటు 370 ఆర్టికల్ రద్దు అంశాలపై పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments