Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైకమిషనర్‌ను వెనక్కి పిలిచే ఆలోచనలో పాకిస్థాన్

Advertiesment
Pakistan
, బుధవారం, 7 ఆగస్టు 2019 (08:28 IST)
కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్థాన్ తమ నిరసన వ్యక్తంచేస్తోంది. కశ్మీర్ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తోంది. పలు చర్యల ద్వారా నిరసన తెలపాలని పాకిస్థాన్ నిర్ణయించినట్టు ఆ దేశ మీడియా చెబుతోంది.
 
ఢిల్లీ నుంచి పాకిస్థాన్ హైకమిషనర్ ను తమ దేశానికి వెనక్కి రప్పించాలని పాకిస్థాన్ నిర్ణయించినట్టుగా వార్తలు వస్తున్నాయి. కశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హక్కులను తొలగించి 2 వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా పరిగణిస్తోందని.. పాకిస్థాన్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.

ప్రత్యేక హక్కులతో ఉంటూ.. పాకిస్థాన్ కు మద్దతుగా ఉన్న ప్రాంతాన్ని ఇండియా బలవంతంగా ఆక్రమించుకుందని ఆరోపిస్తున్నాయి. ఇవాళ్టి పాకిస్థాన్ ప్రధాన వార్తాపేపర్లు, న్యూస్ ఛానెళ్లలోనూ ఇదే కోణంలో వార్తలు వచ్చాయి. అక్రమిత కశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని భారత్ హత్య చేసిందని ఆరోపించాయి.

పాకిస్థాన్ ప్రభుత్వం.. కశ్మీర్ ప్రజలకు అండగా ఉంటుందని ఇప్పటికే అక్కడి ప్రభుత్వం తెలిపింది. భారత్ చర్యకు నిరసనగా ఢిల్లీలోని కార్యాలయం నుంచి హైకమిషనర్ ను తమ దేశానికి వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లిప్‌కార్ట్-అమెజాన్ పోటాపోటీ ఆఫర్లు!