Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సినది...

భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సినది...
, సోమవారం, 5 ఆగస్టు 2019 (13:00 IST)
ఆర్టికల్ 370 భారతదేశ ప్రజలకు మన దేశ ప్రధమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర. అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన ఒప్పందమే ఈ ఆర్టికల్ 370. ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాలి. 
 
భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వం వుంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి. 
 
ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జెండా కూడా వుంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారతదేశ సార్వభౌమాదికారాన్ని జాతీయ పతాకాన్ని జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదంట.
 
సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు. పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం. జమ్మూ కాశ్మీర్లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది. అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది. 
 
ఆర్టికల్ 370 మూలంగా RTI చట్టాలు ఇక్కడ పనిచేయవు. RTI ఇక్కడ అప్లై చేయబడదు. కాగ్‌కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు. జమ్మూ కాశ్మీర్ మహిళలపై షరియా చట్టాలు అమలు చేయబడతాయి. అక్కడి పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు. 
 
కాశ్మీర్లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్దులు) రాజ్యాంగ బద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు అమలు కావాడం లేదు. ఆర్టికల్ 370 మూలంగా వేరే రాష్ట్రానికి చెందిన పౌరులు ఎటువంటి భూ క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. 
 
భారత పౌరసౌత్వం కోసం పాకిస్థానులు చాలామంది ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు.ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడానికి రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. 
35A కూడా రద్దుకు కూడా అమిత్ షా ప్రకటన చేశారు.
 
370 ఆర్టికల్ ద్వారా ఇటువంటి భయంకరమైన ఆర్టికల్ 370 రద్దుతో స్వయం ప్రతిపత్తి హోదాను కాశ్మీర్ కోల్పోనుంది. 35A రద్దుతో  ప్రత్యేక సౌకర్యాలను సైతం కాశ్మీర్ కోల్పోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీలంకలో ఆరుగురు భారతీయుల​ అరెస్ట్​.. కోటి రూపాయల బంగారాన్ని?