Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై సీబీఐ గురి... ఇకపై కష్టాలే కష్టాలు : మంత్రి గంటా శ్రీనివాస్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కష్టాలు స్టార్ట్ కాబోతున్నాయట. ఆయనపై సీబీఐ దృష్టిసారించిందట. ఈ విషయాన్ని స్వయానా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు.

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (11:38 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కష్టాలు స్టార్ట్ కాబోతున్నాయట. ఆయనపై సీబీఐ దృష్టిసారించిందట. ఈ విషయాన్ని స్వయానా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని ఇబ్బందులు పెట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఉసిగొల్పినట్టు తమకు సమాచారం ఉందని, ఎటువంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 
 
ముఖ్యంగా, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి అంటూ సీబీఐ అడుగు పెట్టనుందని, ఒకప్పుడు బీజేపీ నేతలైన విష్ణుకుమార్ రాజు వంటివారు ఆ ప్రాజెక్టును ఎంతో మెచ్చుకుని ఇప్పుడు విమర్శిస్తున్నారని, వారి విమర్శల వెనుక కేవలం రాజకీయ కుట్ర మాత్రమే దాగుందని విమర్శించారు. 
 
చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారని, అపార రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరి ఉచ్చులోనూ పడబోరని అన్నారు. చంద్రబాబును కేసుల్లో ఇరికించాలని ప్రయత్నించిన వైఎస్ రాజశేఖరరెడ్డి విఫలమయ్యారని వ్యాఖ్యానించిన ఆయన, తండ్రి వల్లే కానిది కొడుకు జగన్ వల్ల ఏమవుతుందని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments