Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు

కేంద్రంలోని బీజేపీ సర్కారు నమ్మించి మోసం చేసిందని.. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు అన్నారు. ఏపీ ప్రజల కోసమే

నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు
, శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (08:56 IST)
కేంద్రంలోని బీజేపీ సర్కారు నమ్మించి మోసం చేసిందని.. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నమ్మక ద్రోహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బాబు అన్నారు. ఏపీ ప్రజల కోసమే తాను ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ మోసాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశానని తెలిపారు. తన పోరాటం ఆగదని.. న్యాయం కోసం పోరాడితే తనపై ఎదురుదాడి చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకొచ్చారు.
 
ఆనాడు హైదరాబాదును డెవలప్ చేశానని.. ప్రస్తుతం అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సి వుందని చెప్పారు. ఓ పత్రిక తనను వెనక్కులాగే ప్రయత్నం చేస్తోందని, నిజానికి ఆ పత్రిక రాష్ట్రాన్నే వెనక్కు లాగుతోందని విమర్శలు గుప్పించారు. 
 
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తాను చేస్తున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన సీఎం చంద్రబాబునాయుడు, శుక్రవారం అమరావతిలో సైకిల్ యాత్ర చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసం, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చకు కేంద్రం నిరాకరిస్తున్న వైఖరిని తూర్పారబట్టారు. 
 
వెంకటపాలెం నుంచి అమరావతి వరకూ సైకిల్‌పై వెళ్లి బాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు వీరోచిత పోరాటం చేస్తున్నారని, వారికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. ఎంపీల పోరాటాన్ని ఐదు కోట్ల మంది ఆంధ్రులు అభినందిస్తున్నారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దానికి కారణం పవన్ కళ్యాణ్... ఆయన మాట్లాడితే సర్రున వెళ్తోంది... ఉండవల్లి