Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ కామెంట్స్.. ఆపై వివరణ.. ఏమన్నారంటే..?

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (19:30 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై ట్విట్టర్‌లో  కామెంట్లు చేశారు. తన ట్విట్టర్‌లో ఇలా రాశారు.
 
"ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. దీనిపై గిరిజనులు భగ్గుమన్నారు. రామ్ గోపాల్ వర్మపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై రామ్‌గోపాల్ వర్మ చేసిన ట్వీట్ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. 
 
ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ నాయకులు శుక్రవారం అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై చేసిన ట్వీట్‌పై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. తాను ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో ట్వీట్ చేయలేదని తెలిపారు. మహాభారతంలో ద్రౌపది తన ఫేవరేట్ క్యారెక్టర్ అని.. ఆ క్యారెక్టర్‌ను గుర్తుచేయాలనే ట్వీట్ చేశానని ఆర్జీవీ అన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments