Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆయనతో వర్కవుట్ కాలేదా? నాని షాకింగ్ కామెంట్, బిగ్ బాస్‌పై కె.ఆర్మీ కేసు

సాధారణంగా బిగ్‌బాస్ షోలో జరిగేది అంతా మైండ్ గేమ్. ఇందులో నిర్వాహకులు పార్టిసిపెంట్స్ భావోద్వేగాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. పార్టిసిపెంట్స్ మనఃస్థితిని అనుసరించి వారితో వివిధ రకాల పనులు చేయించడం, ఇతరులతో పోటీపడేలా చేయడం వంటివి చేస్తుంటారు నిర్వాహ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (14:39 IST)
సాధారణంగా బిగ్‌బాస్ షోలో జరిగేది అంతా మైండ్ గేమ్. ఇందులో నిర్వాహకులు పార్టిసిపెంట్స్ భావోద్వేగాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. పార్టిసిపెంట్స్ మనఃస్థితిని అనుసరించి వారితో వివిధ రకాల పనులు చేయించడం, ఇతరులతో పోటీపడేలా చేయడం వంటివి చేస్తుంటారు నిర్వాహకులు.
 
ముల్లును ముల్లుతోనే తీయాలనే విధంగా ఇటీవల ఏర్పాటైన కౌషల్ ఆర్మీ కూడా ఇదే స్ట్రాటజీని అనుసరిస్తోంది. కౌషల్‌కు సంబంధించిన అనుకూల అంశాలను హైలైట్ చేయడం, వాటిని పదేపదే సోషల్ మీడియాలో పంచుకోవడం వంటివి చేయడం వల్ల జనాల్లో కౌషల్‌కు ఆదరణ తీసుకురావడంలో బాగా సఫలమయ్యారు.
 
అయితే బిగ్‌బాస్ చివరి దశలో ఉండగా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఏకంగా బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నానిపై కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు కౌషల్ ఆర్మీ. ఇటీవల సునీల్, అల్లరి నరేష్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు నాని వారితో పెదరాయుడు స్కిట్ వేయించాడు. అందులో కౌషల్ తల్లి పాత్రను పోషించాడు. నాని ఆ తల్లి పాత్రతో సరదాగా 'మీ ఆయనతో వర్కవుట్ కాలేదా' అని ప్రశ్నించాడు. 
 
ఈ వ్యాఖ్యలనే కౌషల్ ఆర్మీక్ ఆయుధంగా చేసుకుని, సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులను ట్యాగ్ చేసి, స్త్రీల గురించి అనుచితంగా మాట్లాడినందుకు నానిపై చర్య తీసుకోవాలని కోరారు. దానికి సమాధానంగా మీకు దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టండి అంటూ హైదరాబాద్ పోలీసుల నుంచి ప్రతిస్పందన రావడంతో, అలా చేయడానికి కౌషల్ ఆర్మీ సిద్ధపడుతున్నట్లు సమాచారం.
 
మనుషుల భావోద్వేగాలతో గేమ్ ఆడే బిగ్‌బాస్‌తోనే కౌషల్ ఆర్మీ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి కౌషల్‌ను గెలిపించడానికి కౌషల్ ఆర్మీ బిగ్‌బాస్‌పై కూడా కేసులు పెట్టేలా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల నుంచి అర్చన అయ్యర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments