Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీముఖికి రోజుకి రూ. 3 లక్షలా.... ఏంటి అంత క్రేజ్...? మాట్లాడతావా బిగ్ బాస్?

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (19:32 IST)
బిగ్ బాస్ హౌసులో శ్రీముఖి చాలా ఎక్కువగా నటిస్తుందని ఎలిమినేట్ అయిన హేమ చెప్పిన సంగతి తెలిసిందే. ఐతే బిగ్ బాస్ ఇంటిలో ఇలాంటి నటనలు, వయ్యారాలు ఇంకా తదితర వేషాలు వెయ్యకపోతే నిలబడటం కష్టం మరి.

హేమక్క అలా అనుకుంది కానీ మన్ను తిన్న పాములా కదలకుండా కూర్చున్నా లేదంటే మరీ ఎక్కువ చేసినా బిగ్ బాస్ ఇంటి నుంచి గెంటేస్తారు. కాబట్టి షోలో అరటి పండు కాకుండా వుండాలంటే గేమ్‌లో సెంటర్ ఫర్ అట్రాక్షన్‌గా నిలబడాలి.
 
ఈ షోలో శ్రీముఖి అలాగే చేయాల్సినవన్నీ చేస్తూ లాగించేస్తుంది. పైగా తను బిగ్ బాస్ ఇంట్లో వున్నప్పటికీ బయట తనకోసం ఓ శ్రీముఖి ఆర్మీ పనిచేస్తోంది. గతంలో కౌశల్ ఆర్మీలా. ఐతే ఈ ఆర్మీలు ఈసారి బాగా ఎక్కువయ్యాయనుకోండి. ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ ఇంట్లో ఎవరూ అందరికంటే ఆట బాగా ఆడుతారో వారిదే పైచేయి... వారే విజేతగా నిలుస్తారు. 
 
ఇదిలావుంటే అసలు బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేందుకే శ్రీముఖికి బాగా ముట్టిందనే ప్రచారం ఓ లెవల్లో జరుగుతోంది. హౌసులో కేవలం మాట్లాడటం మాత్రమే చేసే బిగ్ బాస్ శ్రీముఖికి రోజుకి రూ. 3 లక్షల పారితోషికాన్ని సమర్పించుకున్నట్లు ఓ వార్త అటు నెట్ ప్రపంచంలో ఇటు టీవీ ప్రపంచంలో ఊదరగొడుతోంది.

అంటే 100 రోజులకి( హౌసులో వున్నా ఎలిమినేట్ అయినా) రూ. 3 కోట్లు అని చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం వుందో బిగ్ బాసే చెప్పాలి. హోస్టు నాగార్జున అడిగితేనే బిగ్ బాస్ తిరిగి సమాధానం చెప్పడు. మరి మనం అడిగితే ఇంకేం చెపుతాడు?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments