Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి ఏం చేస్తుందో బ‌య‌టపెట్టిన హేమ‌...

Advertiesment
బిగ్ బాస్ హౌస్‌లో శ్రీముఖి ఏం చేస్తుందో బ‌య‌టపెట్టిన హేమ‌...
, బుధవారం, 31 జులై 2019 (14:09 IST)
బిగ్ బాస్-3 కంటెస్టెంట్లలో సినీ న‌టి హేమ‌ ఒకరు. అయితే.. ఆమె తొలివారమే ఎలిమినేట్ అయ్యి అభిమానులు నిరాశప‌రిచారు. బిగ్ బాస్ అనుభ‌వాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో హేమ మాట్లాడుతూ... తిట్ట‌లేక‌పోతున్నా.. తిట్టించుకోలేక‌పోతున్నాను. ఎలాగా వీళ్ల‌ను హ్యాండిల్ చేయ‌లేం..? ఎందుకు వ‌చ్చిన గొడ‌వ మ‌న‌కి..? బ‌య‌ట ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. ఎట్లా అని ఆలోచించాను. గోడ దూక‌డానికి ప్లాన్ చేసాను. 
 
గోడ దూక‌ద్దు వ‌చ్చేయ్ అన్నారు... వ‌చ్చేసాను అంతే అయిపోయింది. నా వెన‌కాల డ్రామా జ‌రుగుతోంది అనిపించింది. వీళ్లు న‌టిస్తున్నారు అనిపించింది. న‌టించిన వాళ్ల‌లో హైలెట్ ఇద్ద‌రు. ఒక‌రు వ‌రుణ్ సందేశ్ వైఫ్ వితికా, రెండు శ్రీముఖి. ఆమె చేస్తుంది న‌ట‌న అని అంద‌రికీ తెలిసిపోయింది. బిగ్ బాస్ హౌస్‌లో ఏం జ‌రుగ‌నుందో చెప్ప‌లేం. ఏదైనా జ‌ర‌గ‌చ్చు. ఎవ‌రు గెలుస్తారు అనేది ఇప్పుడే చెప్ప‌లేం. హౌస్‌లో ఎవరినీ డామినేట్ చేయలేదు. సొంత వ్యక్తిత్వం నిలుపుకునేందుకు ప్రయత్నించాను. 
 
ఇటీవ‌ల నేను సినిమాలు మానేస్తాను అన్న‌ట్టు రాసేసారు. ఇండ‌స్ట్రీకి ఉన్న ఏకైక నిర్మ‌ల‌మ్మ‌ను నేనే. సంవ‌త్స‌రం అంతా నాకు షూటింగ్‌లు ఉండ‌వు క‌దా. ఇండ‌స్ట్రీకి దూరంగా వెళతాను అని మాత్రం నేను అన‌లేదు. ఇండ‌స్ట్రీలో చేయాల్సిన మంచి ప‌నులు కూడా చాలా ఉన్నాయి. మా అమ్మాయి డిగ్రీ సెకండియ‌ర్ కంప్లీట్ చేసాకా ఇంటి బాధ్య‌త‌లు అప్పచెప్పి నేను పూర్తిగా రాజ‌కీయాల్లోకి వెళ్లాలి అనుకుంటున్నాను. ఏ పార్టీలో చేర‌ుతాను అనేది త్వ‌ర‌లో చెబుతాను అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాక్ ఇచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్