Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ హౌజ్‌లో బాహుబలి స్కిట్.. హేమసేన అనగానే నవ్వులు.. శ్రీముఖి అసహనం?

Advertiesment
Bigg Boss Telugu Season 3
, శనివారం, 27 జులై 2019 (14:15 IST)
ప్రతిష్టాత్మక బిగ్ బాస్ మూడో సీజన్‌లో భాగంగా హౌజ్‌లో సభ్యులందరూ స్కిట్ల కోసం పోటీపడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3లో హేమ, శ్రీముఖిల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. కౌశల్ ఆర్మీలా శ్రీముఖి ఆర్మీ రెడీ అయ్యింది. ఇక హేమసేన కూడా పోటీకి సిద్ధమవుతోంది. ఎన్నో అవాంతరాలను దాటుకుని ప్రారంభమైన బిగ్ బాస్ మూడో సీజన్ ప్రారంభమైన వారం రోజుల్లో రసవత్తర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. 
 
అయితే మూడు రోజులుగా హౌజ్‌లో నెలకొన్న గందరగోళం మధ్య జాఫర్, హేమ, శ్రీముఖి, మహేష్ విట్ట, బాబా భాస్కర్ తదితరులు హాస్యాన్ని పండించడానికి చిన్న బాహుబలి తరహా స్కిట్‌ను ప్రదర్శించారు. ఈ స్కిట్‌లో బాహుబలి ప్రభువుగా జాఫర్, రాణిగా హేమ నటించారు. హేమను హేమసేనగా సంభోదిస్తూ 'ఏం వంట చేశావు' అంటూ అడిగాడు జాఫర్. 
 
ఆ క్రమంలో హేమ స్పందిస్తూ.. ప్రభువా అనగానే అందరూ పకపకా నవ్వారు. హేమ, జాఫర్ మధ్య జరిగిన సంభాషణ ఇంటి సభ్యులకే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బాహుబలి స్కిట్‌లో జాఫర్, హేమలు డైలాగ్‌లు చెప్పడానికి కాస్త తడబడ్డారు.
 
జాఫర్ డైలాగ్ చెప్పడానికి ప్రయత్నించగా... అందులో పవర్ లేదంటూ ఆటపట్టించారు మిగిలిన సభ్యులు. ఈ క్రమంలో బాబా భాస్కర్, శ్రీముఖి వారికి ఎలా డైలాగ్ చెప్పాలో వివరించారు. అయినా ఆ డైలాగ్ చెప్పడంలో విఫలమైన ఇద్దరి పైన శ్రీముఖి తనదైన శైలిలో అసహనాన్ని ప్రదర్శించడం ఈ స్కిట్‌కి హైలైట్ నిలిచిందనే చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ గండం నుండి గట్టెక్కేశాడు.. కాని అది నాకు చుట్టుకుంది