Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటీశ్వరులకు భారం.. మహిళలకు పెద్ద పీట.. ఒక్కో మహిళకు లక్ష రూపాయలు

Advertiesment
కోటీశ్వరులకు భారం.. మహిళలకు పెద్ద పీట.. ఒక్కో మహిళకు లక్ష రూపాయలు
, శుక్రవారం, 5 జులై 2019 (14:35 IST)
కేంద్ర బడ్జెట్‌లో కోటీశ్వరులకు మరింత భారం పడనుంది. రూ. 2 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం ఉన్నవారికి 3 శాతం పన్ను పెంచారు. రూ. 5 కోట్ల పైన ఆదాయం ఉన్నవారికి 7 శాతం పన్ను పెంచడం జరిగింది. పెట్రోల్, డీజిల్ పై ఒక్క రూపాయి అదనపు ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి వుంటుందని.. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 
 
రూ. ఐదు కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న ఆదాయపన్ను చెల్లింపుదారులు ఇకపై మూడు నెలలకు ఒకసారి జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేయాలి. మరోవైపు రోడ్లు, మౌలికవసతుల కల్పన కోసం లీటర్ పెట్రోల్, డీజిల్ పై ఒక్క రూపాయి అదనపు ఎక్సైజ్ డ్యూటీని విధిస్తున్నట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
 
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు తాము ప్రాధాన్యత ఇస్తున్నామనీ, వాటికి వన్ టైమ్ క్రెడిట్ గ్యారెంటీ ఇస్తున్నామని నిర్మలా సీతారామన్  వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టుల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బల్బులతో రూ.18,341 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీతారామన్ పేర్కొన్నారు.
 
ఇంకా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొత్తగా 1.97 కోట్ల ఇళ్లను నిర్మించబోతున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 114 రోజుల్లో ఈ నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇళ్లను నిర్మిస్తామని వెల్లడించారు.

ఇదే పథకం కింద రూ. 80,250 కోట్ల బడ్జెట్‌తో రోడ్ల నిర్మాణాలను చేపడతామని... గ్రామాల అనుసంధానం కోసం 1.25 లక్షల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు ప్రతి సంవత్సరం రూ. 20 లక్షల కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.
 
ఇకపోతే.. ఆఫ్రికా ఖండంలోని 18 దేశాల్లో రాయబార కార్యాలయాలు తెరిచేందుకు అనుమతించామనీ, వాటిలో ఐదింటిని ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను సంక్షోభం నుంచి గట్టెక్కించామని పేర్కొన్నారు. వార్షిక టర్నోవర్ 400 కోట్ల వరకూ ఉన్న కంపెనీలపై 25 శాతం కార్పొరేట్ పన్నును వర్తింపజేస్తున్నామని తెలిపారు. ఈ పరిమితి గతంలో రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకే ఉండేదన్నారు.
 
అలాగే కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి మహిళలకు పెద్ద పీట వేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు లక్ష రూపాయల వరకు రుణం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతే కాకుండా స్వయం సహాయక గ్రూపులలో సభ్యత్వం ఉన్న మహిళలకు రూ.5వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌ కూడా ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు. 
 
ఇది పేద, మధ్య తరగతి మహిళలకు ఎంతగానో ఉపయోగపడటమే కాకుండా వారివారి ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ బడ్జెట్ హైలైట్స్..
దేశవ్యాప్తంగా 17 ఐకానిక్ టూరిజం ప్రాంతాల అభివృద్ధి
మౌలిక రంగం అభివృద్ధి కోసం ‘ఐడియాస్ పథకం’ ప్రారంభం
విద్యుత్ వాహనాల వినియోగం ప్రోత్సహానికి రూ.10,000 కోట్లు మంజూరు
 
నాలుగేళ్లలో రూ.4 లక్షల కోట్ల ఎన్ పీఏలు వసూలు చేశాం
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల సాయం.. బ్యాంకింగ్ రంగంలో ప్రక్షాళన
 
దేశవ్యాప్తంగా రవాణ కోసం పనికొచ్చేలా ‘నేషనల్ ట్రాన్స్ పోర్టు కార్డు తెస్తున్నాం
విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు స్టడీ ఇన్ ఇండియా పథకం
 
ఇంటి రుణాలపై వడ్డీ తగ్గింపు.. రూ.45 లక్షల వరకూ రుణాలపై రూ.3.5 లక్షలు మాఫీ
2018-19లో ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.11.37 లక్షల కోట్లకు చేరింది
డ్వాక్రా సంఘాలకు దేశవ్యాప్తంగా వడ్డీ రాయితీ పథకం ప్రకటన

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడ్జెట్లో మహిళలకి పెద్దపీట... రూ. 5000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం