బాలయ్య నా చెంప వాచేట్లు వాయించాడు, చాలా సంతోషంగా వుంది: అభిమాని

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (20:05 IST)
బాలయ్య బాబుకు మళ్ళీ కోపమొచ్చింది. ఎవరైనా ఫోటోలు తీసుకునేటప్పుడు ఇబ్బంది పెడితే వారి చెంప చెళ్లుమనిపించే బాలక్రిష్ణ మళ్ళీ అదే పని చేశాడు. వద్దన్నా వినకుండా చేస్తే బాలయ్యబాబుకు అస్సలు ఇష్టముండదు. అది ఎవరైనా సరే కొట్టేస్తారు. ఎంతమంది ఉన్నా సరే వదిలిపెట్టడు.
 
తన సొంత నియోజకవర్గం హిందూపురంలో అదే పనిచేశాడు బాలయ్య. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే, బాలక్రిష్ణ 9వ వార్డు అభ్యర్థితో ఇంటిలో మాట్లాడుతున్నాడు. ఒక యువకుడు వారిద్దరి సంభాషణలు వీడియో తీసేందుకు ప్రయత్నించాడు.
 
ముందుగా వద్దు వెళ్ళిపో అని బాలక్రిష్ణ చెప్పాడు. అయినా ఆ యువకుడు వినలేదు. మళ్ళీ వీడియో తీస్తూనే నిలబడ్డాడు. ఇది కాస్తా బాలక్రిష్ణకు బాగా కోపాన్ని తెప్పించింది. అంతే... అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఇంతలో పక్కనున్న నేతలు ఆ యువకుడిని పంపించే ప్రయత్నం చేస్తుండగా కోపంతో బాలక్రిష్ణ అతన్ని మళ్ళీ కొట్టాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు వచ్చి యువకుడిని ఇంటి లోపలి నుంచి బయటకు పంపేశారు. బాలక్రిష్ణ చేష్టలు చూసి అక్కడున్న వారంతా ఇది కొత్తేం కాదు కదా అని మాట్లాడేసుకున్నారట. 
 
అయితే ఈ ఘటన జరిగిన తరువాత ఈ విషయం కాస్త వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమాని సోము స్పందించారు. నేను బాలయ్యబాబు అభిమానిని. నాకు ఇష్టమైన నా నటుడు ఎవరికీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అలాంటిది నన్ను ఏకంగా టచ్ చేశారు. చాలా సంతోషపడుతున్నాను. ఇప్పటికి దీన్ని లైట్ తీసుకోండి అంటున్నాడు సోము.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments